అల వైకుంఠపురములో సినిమా విడుదలై మరో రెండు నెలల్లో రెండేళ్లు పూర్తవుతుంది. దర్శకుడు త్రివిక్రమ్ అలా ఖాళీగా వుండిపోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ సినిమా అనుకుంటే క్యాన్సిల్ అయింది.
మహేష్ తో సినిమా అనుకుంటే అలా అలా వెనక్కు వెళ్తోంది. సర్కారు వారి పాట సినిమా సంక్రాంతికి విడుదల ప్లాన్ లో వుంటే ఈపాటికి త్రివిక్రమ్ కు లైన్ క్లియర్ అయి వుండేది.
కానీ సర్కారువారి పాట ప్రీ సమ్మర్ 2022 కు వెళ్లిపోయింది.అందువల్ల మహేష్ ఇప్పట్లో త్రివిక్రమ్ సినిమా మీదకు వచ్చేలా కనిపించడం లేదు. అక్టోబర్ నుంచి అని వినిపించింది. లేదు.లేదు..నవంబర్ నుంచి అని వినిపించింది. ఇప్పుడు కొత్తగా సంక్రాంతి తరువాత నుంచి అని ఫీలర్లు వదులుతున్నారు.
నిజానికి ఇప్పటి వరకు తివిక్రమ్-మహేష్ పూర్తిగా కథ మీద కూర్చున్నది లేదు అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. టచ్ లో వున్నారు కానీ టోటల్ స్క్రిప్ట్ నెరేషన్ ఇప్పటి వరకు జరగలేదు. స్పెయిన్ లో వున్న మహేష్ ను కలవాలని ప్రయత్నించారు కుదరలేదు.అంతకు ముందు గోవాలో వున్నపుడు కలవాలని ప్రయత్నించారు అది కూడా కుదరలేదు.
చూస్తుంటే సర్కారు వారి పాట పూర్తిగా ఫినిష్ అయ్యే వరకు మహేష్ ఇటు దృష్టి పెట్టేటట్లు కనిపించడం లేదు. త్రివిక్రమ్-మహేష్ ఎంత గట్టిగా అనుకున్నా, ఎంత చకచకా తయారుచేసినా 2023 సంక్రాంతికి కానీ ఆ సినిమాను జనం చూడలేకపోవచ్చు.