క్రికెటర్, హీరో కూతురి ప్రేమాయణం!

ఇది వరకే తన ప్లేబాయ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచాడు  కేఎల్  రాహుల్. ఒక  టాక్ షో లో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయి మాట్లాడగా, ఆ మాటలకు నవ్వుతూ ఉండిపోయి వివాదం పాలయ్యాడు రాహుల్.…

ఇది వరకే తన ప్లేబాయ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచాడు  కేఎల్  రాహుల్. ఒక  టాక్ షో లో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయి మాట్లాడగా, ఆ మాటలకు నవ్వుతూ ఉండిపోయి వివాదం పాలయ్యాడు రాహుల్. అప్పట్లో రాహుల్ కెరీర్ కే దెబ్బ పడే పరిస్థితి కనిపించింది. అయితే బీసీసీఐ క్షమాపణలతో రాహుల్ కుదురుకున్నాడు.

ఇక ఈ క్రికెటర్ పేరు ఇప్పుడు డేటింగ్ వార్తల్లో నిలుస్తూ ఉంది. అది కూడా ఒక నటితో ఇతడి డేటింగ్ సాగుతూ ఉండటంతో మరింత చర్చనీయాంశంగా నిలుస్తోంది ఈ వ్యవహారం. కేఎల్ రాహుల్ డేటింగ్ చేస్తున్నది మరెవరితోనో కాదు..బాలీవుడ్ అలనాటి హీరో సునీల్ షెట్టి కూతురు అతియా షెట్టితో. ఇది వరకే ఈమె హీరోయిన్ గా కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా అంతగా రాణించలేకపోతున్నా.. అతియా ఇప్పుడు క్రికెటర్ మనసు దోచినట్టుగా ఉంది.

ఇటీవలే అతియా పుట్టిన రోజు జరుపుకుంది. ఆ సందర్భంగా కేఎల్ తామిద్దరి ఫొటోనూ పోస్టు చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో వీరిద్దరి మధ్యన సమ్ థింగ్ సమ్ థింగ్ అనే పుకార్లకు మరింత ఊపు వచ్చింది. మరి వీరి ప్రేమాయణం ఎంత వరకూ వెళ్తుందో!