ఉత్తరాంధ్రాలో బీసీ నేత అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రమే. ఆయన అసలు సిసలు ఉత్తరాంధ్రా మాండలీకాన్ని వాడుతూ బీసీ అంటే తానేనని అంటారు. బొత్స సత్యనారాయణకు తన సొంత జిల్లా మీద పట్టుంది.
వెనక్కి తిరిగి చూస్తే మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితం ఉంది. తెలుగుదేశంలో కూడా బీసీ నేతలు చాలా మంది ఉన్నారు. కానీ వారికి సొంత నియోజకవర్గం దాటితే పరపతి బహు తక్కువ. వైసీపీలో బొత్స కీలకంగా ఉన్నారు.
ఆయనకు జగన్ సైతం మర్యాద ఇస్తున్నారు. అలాంటి బొత్సను ఏకంగా జగన్ మీదనే రెచ్చగొట్టే ప్లాన్ ని టీడీపీ అమలు చేస్తోందా అన్న డౌట్లు వస్తున్నాయట. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు బొత్సకు జగన్ అంటే భయమన్నట్లుగా మాట్లాడారు. ఆయన కిమ్మనకుండా ఉంటున్నారుట. ఏమంటే ఏమవుతుందో అని బొత్స అలా ఉంటున్నారు అని అచ్చెన్న ఆయన మీద కామెంట్స్ చేశారు.
బొత్స రాజకీయంగా చాలా చూశారు. ఏపీలో పరిస్థితుల మీద అవగాహన ఉంది. తన గురించి ఆయనకు అవగాహన ఉంది. ఆయన ఎలా వ్యవహరించాలో కూడా తెలుసు. అలాంటపుడు ఆయన ఎందుకు భయపడతారు అన్నదే అనుచరుల మాట. వైసీపీలో బిగ్ ఫిగర్స్ గా ఉన్న బీసీ నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీలో చిచ్చు పెట్టే ప్రయత్నమా ఇది అని వైసీపీ నేతలు అంటున్నారు.
పెద్ద బీసీ అని అచ్చెన్నకు బాబు టీడీపీలో కీలక బాధ్యతలు అప్పగించారు మరి ఆయన ఎంతమేరకు రేపటి ఎన్నికల్లో పనిచేస్తారో అని వైసీపీ నేతలు అంటున్నారు. బొత్సను రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే ఇలా సాగుతున్నాయన్న మాట.