బిగ్‌బాస్ హోస్ట్‌కు భా….రీ రెమ్యున‌రేష‌న్‌

బుల్లితెర‌పై బిగ్‌బాస్ రియాల్టీ షోకున్న క్రేజ్ మ‌రే కార్య‌క్ర‌మానికి లేదంటే అతిశ‌యోక్తి కాదు. బిగ్‌బాస్ రియాల్టీ షో అన్ని రికార్డుల‌ను బ్రేక్ చేస్తూ భార‌తీయ అన్ని భాష‌ల్లోనూ త‌న‌దైన ముద్ర వేసుకొంది. బిగ్‌బాస్ విజ‌య…

బుల్లితెర‌పై బిగ్‌బాస్ రియాల్టీ షోకున్న క్రేజ్ మ‌రే కార్య‌క్ర‌మానికి లేదంటే అతిశ‌యోక్తి కాదు. బిగ్‌బాస్ రియాల్టీ షో అన్ని రికార్డుల‌ను బ్రేక్ చేస్తూ భార‌తీయ అన్ని భాష‌ల్లోనూ త‌న‌దైన ముద్ర వేసుకొంది. బిగ్‌బాస్ విజ‌య ర‌హ‌స్యం…మాన‌వ బ‌ల‌హీన‌తే అని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న పొరుగు వాడి వ్య‌క్తి జీవితంలో ఏం జ‌రుగుతున్న‌దో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి, బ‌ల‌హీన‌త స‌హ‌జంగా ప్ర‌తి మ‌నిషిలో ఉంటుంది. దీన్ని బుల్లితెర ప‌సిగ‌ట్టి సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగింది.

తెలుగులో ఇప్ప‌టికి మూడు బిగ్‌బాస్ రియాల్టీ షోలు స‌క్సెస్ ఫుల్‌గా సాగాయి. త్వ‌ర‌లో నాలుగో సీజ‌న్ కూడా ప్రారంభించ‌డానికి స్టార్ మా నిర్వాహ‌కులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా హిందీలో బిగ్‌బాస్ రియాల్టీ షోల‌కు సంబంధించి ఒక‌ట్రెండు మిన‌హా బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా అద‌ర‌గొట్టాడు.  త్వ‌ర‌లో హిందీలో ప్రారంభ‌మ‌య్యే షోకు కూడా ఆయ‌నే హోస్ట్‌గా ఎంపికైన‌ట్టు స‌మాచారం.

ఒక్కో ఎపిసోడ్‌కు ఆయ‌నకిచ్చే రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయంటే అతిశ‌యోక్తి కాదు. ఒక్కో హోస్టింగ్ ఎపిసోడ్‌కి అక్ష‌రాలా రూ.16 కోట్ల చొప్పున బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఇస్తున్నార‌ని స‌మాచారం. ఈ లెక్క‌న బిగ్‌బాస్ రియాల్టీ షో ముగించే స‌రికి ఆయ‌న‌కు మొత్తం రూ.500 కోట్ల‌ను బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఇస్తున్నార‌ని టాక్‌.

లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆర్థికంగా బాగా దెబ్బ‌తిన్న త‌రుణంలో ఇంత మొత్తంలో ఇస్తున్నారంటే నిజంగా ఆశ్చ‌ర్య‌మే. కానీ ఈ రెమ్యున‌రేష‌న్‌పై విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో నిజానిజాలు ఎప్ప‌టికీ బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశాల్లేవు. ఎందుకంటే బిగ్‌బాస్ షో మాత్ర‌మే రియ‌ల్‌…ఆర్థిక వ్య‌వ‌హారాలు ఎప్ప‌టికీ గోప్య‌మే క‌దా!

శర వేగంగా పవర్ స్టార్ షూటింగ్