స్వేచ్చగా మాట్లాడుతూనే ఉంటా..

ఆయన రాష్ట్ర శాసనసభాపతి, ఎన్నో ఢక్కామెక్కీలు తిన్న నాయకుడు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేత. ఆయనకు సర్వం తెలుసు. ఇక ఎంతో మంది స్పీకర్లను చూసిన పెద్ద మనిషి. అటువంటి తమ్మినేనికి నిబంధనలు…

ఆయన రాష్ట్ర శాసనసభాపతి, ఎన్నో ఢక్కామెక్కీలు తిన్న నాయకుడు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేత. ఆయనకు సర్వం తెలుసు. ఇక ఎంతో మంది స్పీకర్లను చూసిన పెద్ద మనిషి. అటువంటి తమ్మినేనికి నిబంధనలు తెలియవు అని అనుకోగలమా.

అదే మాట ఆయన కూడా అంటున్నారు. తనకు స్పీకర్ అధికారాలు, నియమ నిబంధనలు అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసు అని తమ్మినేని చెబుతున్నారు. నేను ఏది మాట్లాడినా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చూసుకునే మాట్లాడుతున్నా. పైగా రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చతో కూడా మాట్లాడుతున్నా అని తమ్మినేని అంటున్నారు.

తాను స్పీకర్ గా ఎక్కడా రూల్స్ ని అతిక్రమించి మాట్లాడడం లేదని కూడా తమ్మినేని పక్కా క్లారిటీగా చెబుతున్నారు.  తాను కూడా ఒక శాసనసభ్యుడినని, ఆ తరువాతనే స్పీకర్ గా ఎన్నుకోబడ్డానని ఆయన గుర్తుచేస్తున్నారు. తన నియోజకవర్గం ప్రజల సమస్యలు తాను కాక ఎవరు లేవనెత్తుతారని కూడా ఆయన ధర్మంగానే లాజిక్ పాయింట్ తీస్తున్నారు.

స్పీకర్ విధులు, విధానాలు అన్నీ తనకు పూర్తి అవగాహన ఉందని, తాను వాటిని గౌరవిస్తూనే ప్రజల కోసం, వారి సమస్యల కోసం మాట్లాడుతున్నానని, ఇది అర్ధమైన వారికి అర్ధమవుతుందని తమ్మినేని అంటున్నారు. మొత్తానికి తన గురించి అవాకులు, చవాకులు పేలుతున్న వారికి తమ్మినేని ఇచ్చిన గట్టి  జవాబు ఇది.

మోహన్ బాబు కూడా ఫోన్ చేశారు, కానీ నా దేవుడు చెయ్యలేదు

రైతు దినోత్సవం