17న నితిన్ మాస్ట్రో

హీరో నితిన్-తమన్నా కీలకపాత్రలో నటించిన మాస్త్రో ఓటిటి రిలీజ్ డేట్ కొత్తగా ఫిక్స్ అయింది. ఈ సినిమా 9న లేదా 10 హాట్ స్టార్ లో విడుదల అవుతుందనే వార్తలు వినవచ్చాయి.  Advertisement అయితే…

హీరో నితిన్-తమన్నా కీలకపాత్రలో నటించిన మాస్త్రో ఓటిటి రిలీజ్ డేట్ కొత్తగా ఫిక్స్ అయింది. ఈ సినిమా 9న లేదా 10 హాట్ స్టార్ లో విడుదల అవుతుందనే వార్తలు వినవచ్చాయి. 

అయితే అదే రోజు నాని టక్ జగదీష్ ఓటిటి లో విడుదలవుతుందని వార్తలు రావడం, నాగ్ చైతన్య-సాయిపల్లవి ల లవ్ స్టోరీ విడుదల వుండడంతో నిర్మాతలు హాట్ స్టార్ ను కొత్త డేట్ చూడమని రిక్వెస్ట్ చేసారు.

దీంతో సెప్టెంబర్ 17న కొత్త డేట్ గా ఫిక్స్ చేసారని తెలుస్తోంది. అంథాదూన్ సినిమాను తెలుగులో మాస్ట్రోగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకుడు. 

హిందీ లో టబు చేసిన పాత్రను తెలుగులో తమన్నా నటించింది. నభానటేష్ హీరోయిన్. నితిన్ తన స్వంత బ్యానర్ మీద నిర్మించిన ఈ సినిమాకు ఆకెళ్ల రాజకుమార్ సమర్పకుడు.