ఇండియ‌న్ క్రికెట‌ర్ వాచ్ ఖ‌రీదు ఐదు కోట్ల రూపాయ‌లు!

భార‌త క్రికెట‌ర్ల రిచ్ నెస్ గురించి కొత్త‌గా చెప్పేదేమీ లేదు. ఎప్ప‌టికిప్పుడు కొత్త పుంత‌లు తొక్కే వారి ఆర్థిక శ‌క్తి గురించి మాత్ర‌మే మాట్లాడుకోవాలి. ఈ క్ర‌మంలో టీమిండియా క్రికెట‌ర్ హార్ధిక్ పాండ్యా త‌న…

భార‌త క్రికెట‌ర్ల రిచ్ నెస్ గురించి కొత్త‌గా చెప్పేదేమీ లేదు. ఎప్ప‌టికిప్పుడు కొత్త పుంత‌లు తొక్కే వారి ఆర్థిక శ‌క్తి గురించి మాత్ర‌మే మాట్లాడుకోవాలి. ఈ క్ర‌మంలో టీమిండియా క్రికెట‌ర్ హార్ధిక్ పాండ్యా త‌న కొత్త వాచ్ ఫొటోను పోస్టు చేశాడు. అదేదో మామూలు వాచ్ కాదు, దాని ధ‌ర ఏకంగా ఐదు కోట్ల రూపాయ‌ల‌ట‌! ఈ ఖ‌రీదైన వాచ్ ను క‌ట్టుకుని, మ‌ణిక‌ట్టు ఫొటోను పోస్టు చేశాడు హార్ధిక్. అత్యంత ఖ‌రీదైన వాచ్ ను కొన్న ఆనందాన్ని ఈ విధంగా షేర్ చేశాడు ఈ క్రికెట‌ర్. 

ఆ వాచ్ పూర్తిగా ప్లాటినంతో చేసింద‌ట‌, అలాగే అందులో ఎమ‌రాల్డ్స్ ఉంటాయ‌ట‌, వీట‌న్నింటి ధ‌ర‌తో క‌లిపితే.. ఆ వాచ్ ఖ‌రీదు క‌నీసం ఐదు కోట్ల రూపాయ‌ల విలువ చేస్తుంద‌ట‌. మామూలుగా సెల‌బ్రిటీలు ఇలా త‌మ ఖ‌రీదైన థింగ్స్ తో షో చేయ‌రు. అయితే వారి వాచ్ ల ధ‌ర‌లు, బ్యాగుల ధ‌ర‌లు ఏవైనా ఫంక్ష‌న్ల స‌మ‌యంలో చ‌ర్చ‌కు వ‌స్తూ ఉంటాయి. అయితే హార్ధిక్ మాత్రం త‌న వాచ్ ఫొటోను త‌నే షేర్ చేశాడు. 

ఇటీవ‌లి కాలంలో హార్ధిక్ ఫామ్ అంతంత మాత్రంగా ఉంది. కొంత కాలం కింద‌ట హార్ధిక్ కాంట్రాక్ట్ ను కూడా బీసీసీఐ ఒక గ్రేడ్ త‌గ్గించి వేసింది. ఆస్ట్రేలియ‌న్ టూర్లో ప‌రిమిత ఓవ‌ర్ల మ్యాచ్ ల‌లో హార్ధిక్ ఫెయిల్ కావ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. అయితే ప్ర‌స్తుతానికి నేష‌న‌ల్ టీమ్ కు సంబంధించి హార్ధిక్ కు చోటుకు లోటు లేక‌పోవ‌చ్చు. 

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టీమ్ లో హార్ధిక్ కు క‌చ్చితంగా చోటు క‌ల్పించాలంటూ కొంద‌రు మాజీలు వాదిస్తున్నారు. ఒకానొక ద‌శ‌లో రెండో క‌పిల్ దేవ్ అనేంత స్థాయి ప్ర‌శంస‌లు పొందిన హార్ధిక్ కు ఇప్పుడు జ‌ట్టులో చోటు ఉండాలా, వ‌ద్దా అనే చ‌ర్చ‌కు తెర లేవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ క్రికెట‌ర్ యూఏఈలో ఉన్నాడు. అక్క‌డ త్వ‌ర‌లో ఐపీఎల్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే అక్క‌డ‌కు చేరుకున్న‌ట్టుగా ఉన్నాడు.