బాలీవుడ్లో అమితాబచ్చన్, మాధురీ దీక్షిత్ ఇద్దరూ నట దిగ్గజాలే. తమ అద్భుత నటనతో జాతీయ స్థాయిలో వాళ్లిద్దరూ విశేష ప్రేక్షకదారణ పొందారు. బచ్చన్‌తో పాటు మాధురీ సినిమాలంటే పడి చచ్చే అభిమానులు లక్షల్లో ఉన్నారు. కానీ వాళ్లిద్దరు కలిసి కనీసం ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా నటించలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం. వాళ్లిద్దరు కలిసి నటించక పోవడానికి కారణం లేకపోలేదు. అదెంటో తెలిస్తే అభిమానులు షాక్ తింటారు. అదేంటో తెలుసుకుందాం పదండి.
1980లలో మాధురీ దీక్షిత్ వెండితెర ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు విజయం సాధించలేదు. దీంతో ఆమెతో కలిసి నటించడానికి సహజంగానే ఏ హీరో కూడా ముందుకు రాలేదు. అలాంటి సెంటిమెంట్, కష్టకాలంలో బాలీవుడ్ అగ్ర హీరో అనీల్ కపూర్ ధైర్యంతో ముందడుగు వేసి మాధురితో కలిసి బేటా, తేజాబ్, హిఫాజట్, పరిందా తదితర చిత్రాలు చేశాడు. ఇవి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయంతో పాటు మాధురీ దీక్షిత్‌ని సూపర్‌స్టార్‌ని చేశాయి.
సహజంగానే సక్సెస్ బాట పట్టిన మాధురీ దీక్షిత్‌కు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ సరసన నటించే అవకాశం దక్కింది. కానీ అనీల్‌కుమార్ అందుకు అంగీకరించలేదు. బాలీవుడ్లో మాధురీకి తాను లైఫ్ ఇచ్చానని, అందువల్ల తనతోనే ఆమె నటించాలని నిబంధన పెట్టాడు. అనీల్ కపూర్‌ను మాధురీ కాదనలేకపోయారు. ఈ కారణంతోనే ఇప్పటి వరకు అమితాబ్ సరసన మాధురీ నటించలేకపోయారు.
అయితే ఆ తర్వాత అనీల్ కపూర్‌తోనూ మాధురీ దీక్షిత్ ఏ చిత్రం చేయలేదు . గత ఏడాది టోటల్ ఢమాల్ అనే చిత్రంలో మాధురీ తళుక్కుమని మెరిశారు. ఈ నిసిమాలో అనీల్ కపూర్, అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రలు పోషించారు. కానీ అమితాబ్ సరసన మాధురీ దీక్షిత్‌ను చూడాలని కోరుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది.
గృహమే లేకుండా ప్రజలతో గృహ ప్రవేశం చేయించిన ఘనుడు చంద్రబాబు