క‌రోనాకేం తెలుసు ఆమె తొలి తెలుగు మేయ‌ర్ అని?

క‌రోనా వైర‌స్ గురించి తెలుసు క‌దా?  దానికి త‌ర‌త‌మ బేధాలు ఏ మాత్రం లేవ‌ని. అయితే త‌న‌కు తానుగా ఎవ‌రి ద‌గ్గ‌రికి పోదు కానీ, దాని ద‌గ్గ‌రికి పోతే మాత్రం ఊరికే విడిచి పెట్ట‌దు.…

క‌రోనా వైర‌స్ గురించి తెలుసు క‌దా?  దానికి త‌ర‌త‌మ బేధాలు ఏ మాత్రం లేవ‌ని. అయితే త‌న‌కు తానుగా ఎవ‌రి ద‌గ్గ‌రికి పోదు కానీ, దాని ద‌గ్గ‌రికి పోతే మాత్రం ఊరికే విడిచి పెట్ట‌దు. బ్రిట‌న్ ప్ర‌ధాని మొద‌లుకుని చాలా మంది ప్ర‌ముఖుల‌ను ఆ వైర‌స్ పీడించి వ‌దిలేసిన విష‌యాల గురించి మ‌న‌కు తెలుసు.

తాజాగా షోలాపూర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (ఎస్‌ఎంసీ) మొట్ట మొద‌టి తెలుగు మేయ‌ర్ యెన్నం కాంచ‌న క‌రోనా బారిన ప‌డ్డారు. ఆమెతో పాటు భ‌ర్త యెన్నం ర‌మేశ్‌కు కూడా క‌రోనా సోకిన‌ట్టు వైద్యులు ధ్రువీక‌రించారు. దీంతో మేయర్‌ దంపతులను ఆస్పత్రికి తరలించారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా సదాశివపేటకు చెందిన కాంచన 2019 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో షోలాపూర్‌ మేయర్‌గా ఎన్ని కయ్యారు. మేయర్‌ దంపతులిద్దరికీ కరోనా సోకడంతో వారు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని అధికారులు శానిటైజ్‌ చేశారు.  అంతేకాదు, లాక్‌డౌన్ స‌మ‌యంలో   ఆమె ఎక్కడెక్కడ పర్యటించారు.. ఎవరెవరిని కలిశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.  కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులు, క్వారంటైన్, కంటైన్మెంట్‌ ప్రాంతాల్లోనూ ఆమె తిరిగారు.

ఈ నేప‌థ్యంలో గత వారం రోజులుగా ఆమె అస్వస్థతకు గురి అయ్యారు. అనుమానంతో వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోగా  కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె భర్త, వెంట తిరిగిన పలువురు ఉద్యోగులు, అధికారులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఆమె భర్తకు మినహా మిగతా వారికి నెగెటివ్ రావ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. 

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

గృహ‌మే లేకుండా ప్ర‌జ‌ల‌తో గృహ ప్ర‌వేశం చేయించిన ఘ‌నుడు చంద్ర‌బాబు