పేరుకి లెక్చరర్.. చేసేవన్నీ కీచక పనులు

నలుగురికి మంచి చెప్పే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. బుద్ధిలో మాత్రం కామాంధుడ్ని తలపించాడు. హైదరాబాద్ కు చెందిన ఓ కీచక లెక్చరర్.. తన స్నేహితురాలి ఫొటోల్ని మార్ఫింగ్ చేశాడు. నగ్నంగా ఉండేలా ఫొటోలు మార్ఫ్…

నలుగురికి మంచి చెప్పే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. బుద్ధిలో మాత్రం కామాంధుడ్ని తలపించాడు. హైదరాబాద్ కు చెందిన ఓ కీచక లెక్చరర్.. తన స్నేహితురాలి ఫొటోల్ని మార్ఫింగ్ చేశాడు. నగ్నంగా ఉండేలా ఫొటోలు మార్ఫ్ చేసి అందరికీ వాట్సాప్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉంటుంటాడు హరీష్ కుమార్. ఘట్ కేసరలోని ఓ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఉప్పల్ లోనే ఎంటెక్ చదువుతున్న ఓ అమ్మాయితో ఇతడికి పరిచయమైంది. లెక్చరర్ అవ్వడంతో అతడితో ఫ్రెండ్ షిప్ కొనసాగించింది యువతి. కొన్ని రోజులకు సదరు అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాడు లెక్చరర్.

లెక్చరర్ ప్రపోజల్ ను అమ్మాయి తిరస్కరించింది. ఇష్టం లేదని చెప్పడంతో హరీష్ కోపం పెంచుకున్నాడు. అమ్మాయికి వాట్సాప్ లో అసభ్యకర మెసేజీలు పంపించడం మొదలుపెట్టారు. అప్పటికీ అమ్మాయి దారిలోకి రాకపోవడంతో ఆమె ఫొటోల్ని మార్ఫింగ్ చేసి ఆమెకు పంపించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఏకంగా ఆ మార్ఫింగ్ ఫొటోల్ని ఆమె తల్లిదండ్రులు, బంధువులకు కూడా పంపించసాగాడు.

దీంతో లెక్చరర్ వేధింపుల్ని భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. అయితే అప్పటికే సదరు లెక్చరర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయినప్పటికీ పోలీసులు వదల్లేదు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడి పట్టుకున్నారు. 

మత్తులో మత్తు డాక్టర్/నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అసలు రూపం