కొండంత రాగం.. ఇప్పుడు ఎక్కడా కనపడ్డంలేదే..?

ఏవండోయ్ నానీగారూ.. అంటూ గతంలో కొండంత రాగం తీసిన గొంతు ఇప్పుడు వినపడ్డంలేదు. తెలుగుదేశం పార్టీ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ దివ్యవాణి ఎక్కడా కనిపించడం లేదు. జూమ్ మీటింగ్ లతో రెచ్చిపోయే దివ్యవాణి సోషల్ మీడియాకు…

ఏవండోయ్ నానీగారూ.. అంటూ గతంలో కొండంత రాగం తీసిన గొంతు ఇప్పుడు వినపడ్డంలేదు. తెలుగుదేశం పార్టీ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ దివ్యవాణి ఎక్కడా కనిపించడం లేదు. జూమ్ మీటింగ్ లతో రెచ్చిపోయే దివ్యవాణి సోషల్ మీడియాకు పూర్తిగా దూరమయ్యారు. 

టీడీపీతో దివ్యవాణి పెట్టుకున్న కాంట్రాక్ట్ ముగిసిందా లేక, ఆమె అవసరం లేదని పార్టీ గుర్తించిందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీకి ఉన్న మహిళా పెయిడ్ ఆర్టిస్టుల్లో దివ్యవాణి బాగా ఫేమస్. ఎవరైనా చంద్రబాబు గురించి కానీ, లోకేష్ గురించి కానీ పల్లెత్తు మాట అనగానే.. వెంటనే జూమ్ కాన్ఫరెన్స్ లో ప్రత్యక్షం అవడమే దివ్యవాణి డ్యూటీ. 

నాలుగు సినిమా స్టైల్ డైలాగులు కొట్టి, తిట్టిపోయడం ఆమెకు అప్పగించిన బాధ్యత. అప్పట్లో దివ్యవాణి జూమ్ మీటింగ్ అనగానే.. పేటీఎంలో డబ్బులు పడ్డాయా అనేది ఫస్ట్ కామెంట్. అంత హడావిడి చేసిన ఆమె ఇప్పుడు పూర్తిగా సోషల్ మీడియాకు మొహం చాటేయడం నిజంగా విచిత్రమే.

వంగలపూడి అనిత, అనురాధ.. ఇలా ఒకరిద్దరు మహిళా నేతలు మాత్రమే టీడీపీ తరపున గొంతు వినిపించడానికి ముందుకొస్తున్నారు. తిట్టినా, తిట్టించుకున్నా వీరికే చెల్లింది. ఇన్నాళ్లూ ఇలా తిట్టడానికి, తిట్టించుకోడానికి దివ్యవాణి కూడా ముందు వరుసలో ఉండేవారు. కానీ ఇప్పుడామె కనుమరుగు కావడంతో అనిత, అనురాధ మాత్రమే కనపడుతున్నారు. 

ఇక జెంట్స్ బ్యాచ్ లో పట్టాభిని కొట్టేవారెవరూ లేరు. నిజంగా పట్టాభిని కొంతమంది కసితీరా కొట్టినా కూడా ఆయన ఆగలేదు. బాబుతో పెట్టుకున్న కాంట్రాక్ట్ విలువ అలాంటిది మరి. మొత్తమ్మీద టీడీపీకి ఉన్న అద్దె మైకుల్లో ఒకటి మూగబోవడం మాత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. 

దివ్యవాణి తన మనసు మార్చుకున్నారని, అవకాశాలు వస్తే సినిమాలు, సీరియళ్లలో నటించడానికి ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా దివ్యవాణి తన మనసులో మాటను అలా బయటపెట్టారు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.

చంద్రబాబు కోసం ఎన్నిసార్లు తిట్టినా, తిట్టించుకున్నా చివరకు ఫలితం ఉండదనేది ఆమెకు కూడా అర్థమైనట్టుంది. అందుకే అర్థాంతరంగా తన వేషం చాలించినట్టున్నారు.