గంటా వారి వంట!

కరోనా వైరస్ కాదు కానీ అందరికీ అన్నీ నేర్పిస్తోంది. సెలిబ్రిటీలు అయితే తమకు ఉన్న కళలను ఇంట్లో వారి మీద బాగానే ప్రయోగిస్తున్నారు. లాక్ డౌన్ తో తలుపులు వేసుకుని కూర్చుంటున్నారు. దాంతో వంట…

కరోనా వైరస్ కాదు కానీ అందరికీ అన్నీ నేర్పిస్తోంది. సెలిబ్రిటీలు అయితే తమకు ఉన్న కళలను ఇంట్లో వారి మీద బాగానే ప్రయోగిస్తున్నారు. లాక్ డౌన్ తో తలుపులు వేసుకుని కూర్చుంటున్నారు. దాంతో వంట గది ఓ ప్రయోగశాలగా మారిపోతోంది.

దీనికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అతీతం ఏమీ కాదుగా. వర్తమాన రాజకీయాల్లో  ఆయన దిగ్గజ నాయకుడు, కాఫీ కావాలన్నా కూడా పది చేతులు నిలిచి అందిస్తాయి. అటువంటి గంటా వారు లాక్ డౌన్ వల్ల బోర్ ఫీల్ అయ్యారో ఏమో కానీ వంట గదిలోకి వెళ్ళారు.

కాఫీ కలుపుతూ తనకు కూడా అన్నీ వచ్చునని నిరూపించుకున్నారు. వంటకు కూడా తయారైపోయారు. మొత్తం మీద రాజకీయ వంటలో పండిపోయిన గంటా సారు పాకశాస్త్రంలో కూడా తాను పండితుడినేననిపించుకుంటున్నారు. తన కత్తికి ఇరువైపులా పదునేనని ఎదురులేదని కూడా ఆయన చాటుతున్నారు.

మిగిలిన వారిలా సొల్లు కబుర్లతో మీడియాను విసిగించకుండా గంటా లాక్ డౌన్ని తాను పాటిస్తూ అందరికీ ఆదర్శంగా కూడా నిలిచారు. మరి టీడీపీ పెద్దాయన చంద్రబాబు కూడా గంటాను స్పూరిత్గా తీసుకుని వంట చేస్తారేమో చూడాలి.

నీ మనవడు దేవాన్ష్ ని తెలుగు మీడియంలో చేర్పించు