చంద్రబాబు, కేసీఆర్.. ఆస్తి మూరెడు ఆశ బారెడు!

చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ల వ్యక్తిగత ఆస్తుల గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. వారి వ్యక్తిగత ఆస్తులు  వందల కోట్ల రూపాయల్లో ఉండొచ్చు, ఇటీవలే చంద్రబాబు నాయుడు తన నామినేషన్ పత్రాల్లో వందల  కోట్ల…

చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ల వ్యక్తిగత ఆస్తుల గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. వారి వ్యక్తిగత ఆస్తులు  వందల కోట్ల రూపాయల్లో ఉండొచ్చు, ఇటీవలే చంద్రబాబు నాయుడు తన నామినేషన్ పత్రాల్లో వందల  కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించుకున్నారు. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మెంబర్ల ఆస్తి మొత్తం కూడితే అది వెయ్యి కోట్ల రూపాయలను దాటేలా ఉంది.

ఇక్కడ ఆ ఆస్తి గురించి కాదు కానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడులకు ఎన్ని ఎంపీ సీట్లు దక్కుతాయో ఇంకా అధికారికంగా తెలీదు కానీ, వీరి హడావుడి చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు.

వీళ్లు 'ప్రధాని పీఠం' మీద కన్నేశారు. ఆ పీఠంలో కూర్చోవాలని పైకి అయితే వీరు చెప్పుకోవడం లేదు కానీ, తమ కనుసన్నల్లో పని చేసే వాళ్లు ఆ సీట్లో కూర్చోవాలని బయటకు చెప్పుకొస్తున్నారు. తాము చక్రం తిప్పుతామన్నట్టుగా హడావుడి చేస్తూ ఉన్నారు.

ఇంత చేస్తే వీళ్లు పోటీ చేస్తున్నదే తక్కువ ఎంపీ సీట్లకు. ఈ మాత్రం దానికే వీరు చేస్తున్న హడావుడి మాత్రం పీక్స్ కు చేరిపోయింది. కేసీఆర్ పార్టీ పోటీలో ఉన్నది పదహారు ఎంపీ సీట్లకు, చంద్రబాబు నాయుడి పార్టీ పోటీలో ఉన్నది ఇరవై ఐదు ఎంపీ సీట్లకు. వీటిల్లో వీరు ఎన్ని గెలుస్తారు అనేది శేష ప్రశ్న.

సర్వేలేమో కేసీఆర్ పన్నెండు సీట్లు అంటున్నాయి. చంద్రబాబుకు మూడు  నుంచి ఆరు ఎంపీ సీట్లు అంటున్నాయి! ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ల మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి. తనకు దక్కే పన్నెండు  పద్నాలుగు ఎంపీ సీట్లతోనే దేశంలోని అన్ని పార్టీలనూ ఏకం చేసేస్తానంటూ కేసీఆర్ తిరుగుతూ ఉన్నారు. తిరిగితే తిరిగారు అది ప్రజల డబ్బుతో కాకపోతే  సంతోషం.

ఇక చంద్రబాబు నాయుడుకు దక్కేది ఐదారు ఎంపీ  సీట్లు అని సర్వేలు అంటున్నప్పటికీ ఈయన ఈనెల ఇరవై ఒకటో తేదీన అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసేసి ప్రధాని సీట్లో ఎవరు కూర్చోవాలో డిసైడ్ చేసేస్తాం.. అంటూ డప్పుకొడుతున్నారు! ఇలా చెప్పుకునే వీళ్లకు తమ తమ మాటలు కామెడీ అనిపించడం లేదేమో కానీ, వినే వాళ్లకు మాత్రం వీళ్ల మాటల్లో బోలెడంత వినోదం లభిస్తోంది!

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి అనుకూలత ఉన్నట్టే..