నెగిటివ్ అని తేలితే భారీ నజరానా…

ఏ విషయంలో అయినా పాజిటివ్ గా ఉండమని అంతా అంటారు. కానీ కరోనా విషయంలో మాత్రం పాజిటివ్ అన్న మాట వింటే ఎవరైనా పరార్ అవుతారు. అలాంటిది మహమ్మారి గొప్పతనం మరి. Advertisement ఇదిలా…

ఏ విషయంలో అయినా పాజిటివ్ గా ఉండమని అంతా అంటారు. కానీ కరోనా విషయంలో మాత్రం పాజిటివ్ అన్న మాట వింటే ఎవరైనా పరార్ అవుతారు. అలాంటిది మహమ్మారి గొప్పతనం మరి.

ఇదిలా ఉంటే కరోనా పీడను వదిలించడానికి అధికారులు నానా రకాలైన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అయితే రెండవ దశ కరోనా మహమ్మారి ఏకంగా పల్లెలల్లో తిష్ట వేసుకుని కూర్చుంది. పట్నాలలో ఆ మాత్రమైనా వైద్య సదుపాయం ఉంది. గ్రామాలలో ఆ పరిస్థితి లేదు.

దాంతో పాటు ట్రేసింగ్ ఎంత చేసినా కూడా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం అన్నది గ్రామ‌స్థుల చేతుల్లోనే ఉంది మరి. దాంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ అయితే ఒక అద్భుతమైన నజరానాను పల్లెల కోసం ప్రకటించారు.

కరోనా విష పురుగు ఉనికి లేని గ్రామాలు ఉంటే వాటికి ఏకంగా లక్ష రూపాయల దాకా నగదు నజరానాగా ఇచ్చి గ్రామాభివృద్ధికి సాయపడతామని కలెక్టర్ నివాస్ తాజాగా స్పష్టం చేశారు. 

గ్రామ స్థాయిలో కోవిడ్ కట్టడికి కమిటీలు వేసి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు. మొత్తానికి సిక్కోలు కలెక్టర్ నజరానా ఏదో బాగానే ఉందంటున్నారు. ఇది వర్కౌట్ అయితే పల్లెలు వాటంతట అవే కరోనా పీడను వదిలించుకుంటాయనే అంటున్నారు.