జాతకం కోసం ఇల్లు మారిన హీరో?

ఆ హీరోకి జాతకాలు, ముహుర్తాలు, నమ్మకాలు ఎక్కువ. పూజలు, పురస్కారాలు కూడా ఎక్కువే. అయితే సమస్య ఏమిటంటే, ఇలాంటి నమ్మకాలు వున్నవారిని ఆశ్రయించి పబ్బం గడిపేసుకుంటూ వుంటారు కొందరు. ఏవేవో చెప్పి, పాపం, అమాయకుల్ని…

ఆ హీరోకి జాతకాలు, ముహుర్తాలు, నమ్మకాలు ఎక్కువ. పూజలు, పురస్కారాలు కూడా ఎక్కువే. అయితే సమస్య ఏమిటంటే, ఇలాంటి నమ్మకాలు వున్నవారిని ఆశ్రయించి పబ్బం గడిపేసుకుంటూ వుంటారు కొందరు. ఏవేవో చెప్పి, పాపం, అమాయకుల్ని చేసి ఆడించేస్తుంటారు. వీళ్లేమో వాళ్లనే మూఢంగా నమ్ముతూ వుంటారు.

లేటెస్ట్ సంగతి ఏమిటంటే, సదరు హీరోకి నమ్మకం వున్న గురువు ఎవరో ఒక చిట్కా వైద్యం లాంటి ఉపాయం చెప్పారు. అలాచేస్తే, త్వరలో విడుదల చేయబోయే పిక్చరు హిట్ అవుతుందని, ఇప్పటికే విడుదల చేసి సినిమా పుంజుకుని, మాంచి కలెక్షన్లు సాధిస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇంతకీ చెప్పిన ఆ ఉపాయం ఏమిటంటే, ఇప్పుడున్న ఇంట్లోంచి వేరే ఇంట్లోకి మారడం. కానీ ఆ హీరోది స్వంత ఇల్లు. మాంచి ఇల్లు. మారడానికి కుదరదు. దానికీ చిట్కా వైద్యం వుందని చెప్పినట్లు తెలుస్తోంది. అదేమిటంటే, ఇప్పుడున్న ఇంట్లోని హీరో గదిలో సామాన్లు అన్నీతీసి, బయటకు తీసుకెళ్లి, వేరేచోట పెట్టి, కొన్నిగంటల తరువాతో, లేదా ఒకరోజు తరువాతో వెనక్కు తెచ్చుకోవాలట.

అలా చేస్తే, గ్రహస్థితి బాగుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆ హీరో ఈ రోజే దానికి ముహుర్తం ఫిక్స్ చేసి, ఆ మేరకు ఆచరించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు ఓ కొసమెరుపు కూడా వుంది. ఈ సామాన్లు బయటకు వెళ్లి, వెనక్కు వచ్చేలోగా ఎవరినీ పలకరించడం కానీ, మాట్లాడడం కానీ చేయవద్దని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సంగతి తెలియక, ఓ అమాయక చక్రవర్తి, ఏదో పలకరిద్దామనో, అభినందిద్దామనో, హీరోగారు వున్న క్యారవాన్ లోకి వెళ్లారట. అంతే స్టారు సారు అగ్గిమీద గుగ్గిలం అయిపోయినట్లు గ్యాసిప్ వినిపిస్తోంది. పుణ్యానికిపోతే పాపం ఎదురయిందని బాధపడడం ఆ అమాయక చక్రవర్తి వంతు అయింది.

అయినా నమ్మకాలు నమ్మే హీరో సంగతి అలావుంచితే, ఇలా నమ్మబలికి తాము చెప్పినట్లు ఆడించే ఆ గురువునో, సిద్దాంతినో, భలే గొప్పోరు అనుకోవాలి.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌… ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది