అదిగో బన్నీ.. ఇదిగో డైరక్టర్

ఒంటరిగా వున్న వారిని చూస్తే కన్నుకొట్టబుద్ది అన్నట్లుంది హీరో బన్నీ వ్యవహారం. ఇండస్ట్రీ మొత్తంమీద కింద నుంచి పైదాకా ఖాళీగా వున్న ఏకైక హీరో బన్నీ మాత్రమే. అందుకే ప్రతి డైరక్టర్ బన్నీని టార్గెట్…

ఒంటరిగా వున్న వారిని చూస్తే కన్నుకొట్టబుద్ది అన్నట్లుంది హీరో బన్నీ వ్యవహారం. ఇండస్ట్రీ మొత్తంమీద కింద నుంచి పైదాకా ఖాళీగా వున్న ఏకైక హీరో బన్నీ మాత్రమే. అందుకే ప్రతి డైరక్టర్ బన్నీని టార్గెట్ చేస్తూ కథలు అల్లే పనిలో బిజీగా వున్నారు. విక్రమ్ కె కుమార్ ఏడాదిపాటు బన్నీ క్యాంప్ లో వుండి, కొన్ని బ్లాక్ లు సెట్ కాక, ఆఖరికి బయటకు వచ్చి, నానితో సినిమా చేస్తున్నారు. అయితే ఇంకా బన్నీతో సినిమా ఆశలు అలాగే సజీవంగా వున్నాయి.

మరోపక్క దర్శకుడు మారుతి ఓ సినిమాను బన్నీతో చేయాలన్న కోరిక లాంగ్ పెండింగ్. ఎగ్జయిటింగ్ సబ్జెక్ట్ కుదిరితే చేయాలన్నది ఇద్దరి మధ్య వున్న లాక్ పాయింట్. ఓ సబ్జెక్ట్ అయితే మారుతి ప్రత్యేకంగా బన్నీ కోసం తయారుచేస్తున్నారని వార్తలు వున్నాయి.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తరువాత దర్శకుడు విఐ ఆనంద్ కు గీతా నుంచి అడ్వాన్స్ వచ్చింది. ఆ అడ్వాన్స్ బన్నీ కోసమే అని అప్పట్లో టాక్ వచ్చింది. కానీ ఆ తరువాత ఆనంద్ అలా అలా రవితేజ దగ్గరకు వెళ్లారు. గీతా అడ్వాన్స్ అలాగే వుంది.

గీతగోవిందం బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు పరుశురామ్ గీతాలోనే వున్నారు. అక్కడే మాంచి స్క్రిప్ట్ రెడీ చేసుకునే పనిలో వున్నారు. ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏమిటంటే, అది బన్నీ కోసమే అన్నది. ఇక ఇవన్నీ ఇలా వుంటే త్రివిక్రమ్ డైరక్షన్ లో బన్నీ సినిమా మాత్రం ఫిక్స్ అయింది.

అయితే అది ఎప్పుడు ప్రకటనగా బయటకు వస్తుంది. ఎప్పుడు సెట్ మీదకు వెళ్తుంది అన్నది భేతాళ ప్రశ్న. దానికి జవాబు ఎప్పుడు లభిస్తుందో?

హంగ్ కోసం ప్రయత్నిస్తున్న జనసేన… పవన్ కింగ్ మేకర్ అవుతాడా?

AMB సినిమా హాల్స్ ప్లాన్స్ అంతా నమ్రతదే