ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఓ సస్సెన్స్ వీడిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కు పిలుపు వస్తుందా? రాదా? అన్న విషయం తేలిపోయింది. బాబాయ్ బాలయ్యే స్వయంగా ఫోన్ చేసి పిలిచారు. ఎన్టీఆర్ హాజరవుతున్నారు. అయితే ఎన్టీఆర్ అల్లుడు, ఆంధ్ర సిఎమ్ చంద్రబాబు నాయుడు సంగతేమిటి?
విశ్వసనీయవర్గాల బోగట్టా ప్రకారం ఆయన ఈ ఫంక్షన్ కు రావడం లేదు. ఆయనే కాదు, లోకేష్ కూడా రావడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ రాకుండా వుంటారా? అన్నది అనుమానం. కానీ రావడం లేదనే ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. మరోపక్క బాబుతో సరిపడని, ఎన్టీఆర్ కుమార్తె పురంధ్రీశ్వరి హాజరవుతున్నారని, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువ వున్నాయని తెలుస్తోంది.
బయోపిక్ అడియో ఫంక్షన్ ను నందమూరి ఫ్యామిలీ సభ్యుల అందరి మధ్య చేయాలని ముందుగానే నిర్ణయించారు. కూతుర్లు, అల్లుళ్లు, కొడుకులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లు అందరినీ పిలుస్తారని వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ ను చివరి నిమషం వరకు అంటే కచ్చితంగా 24 గంటల ముందు వరకు పిలవలేదు. అప్పటికప్పుడు బాలయ్య ఫోన్ చేసి పిలిచారు. కళ్యాణ్ రామ్ కు మాత్రం మూడు రోజుల ముందే పిలుపు అందినట్లు బోగట్టా.
మరి ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ రాకుండా వుంటారా? చంద్రబాబు భార్య, కోడలు లోకల్ గానే వుండారు కాబట్టి, వాళ్లు ఎలాగూ వస్తారు. మరి లోకేష్, చంద్రబాబు రాకపోవడానికి పెద్దగా రీజన్ కూడా లేదు. ఉత్తర కోస్తాను కుదిపిన తుపాను వెళ్లిపోయింది. బాబుగారు పెద్దగా దగ్గర వుండే చేయాల్సినంత ఏమీ లేదు. మరి ఏ రీజన్ తో రాకుండా వుంటారు?
అందువల్ల హాజరుకావడానికే అవకాశం ఎక్కువని కొందరు అంటుంటే, రావడం లేదని ఇండస్ట్రీలోని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
అన్ని దోశలు ఎలా వేశావ్ భయ్యా.. ఆకలేసి ఫన్నీ వీడియో
కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్