రారండోయ్ పరుగు ఆగలేదు

నాగార్జున ఫుల్ హ్యాపీ యే ఇంక. సెకెండ్ వీకెండ్ కూడా రారండోయ్ వేడుక చూద్దాం మంచి కలెక్షన్లు నమోదు చేస్తోంది. సినిమా కాస్త డివైడ్ టాక్ తో స్టార్ట్ అయినా, మంచి కలెక్షన్లు ఫస్ట్…

నాగార్జున ఫుల్ హ్యాపీ యే ఇంక. సెకెండ్ వీకెండ్ కూడా రారండోయ్ వేడుక చూద్దాం మంచి కలెక్షన్లు నమోదు చేస్తోంది. సినిమా కాస్త డివైడ్ టాక్ తో స్టార్ట్ అయినా, మంచి కలెక్షన్లు ఫస్ట్ వీక్ లో రాబట్టింది. నాగా చైతన్యకు ఇది కచ్చితంగా ముఫై కోట్ల సినిమా అవుతుందిని అప్పట్లోనే ట్రేడ్ వర్గాలు లెక్కలు కట్టాయి.

కానీ ఇంకా ఎక్కడో చిన్న అనుమానం వుండేది సినిమా కంటెంట్ విషయంలో వున్న డివైడ్ టాక్ వుండడంతో. పైగా మళీవారం రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. రెండింటికీ ఇంతో అంతో, వేటి క్రేజ్ వాటికి వుంది అని.

కానీ ఈ రెండు సినిమాలు కూడా రారండోయ్ పరుగును ఆపలేకపోయాయి. అంధగాడు కాస్త పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది కానీ, ఫ్యాషన్ డిజైనర్ సినిమా మాత్రం సరైన టాక్ తెచ్చుకోలేకపోయింది. దీంతో రారండోయ్ దూకుడు తగ్గలేదు. ఈ వీకెండ్ తో రారండోయ్ ఇరవై కోట్ల షేర్ ను దాటుతుంది.

నాగా చైతన్య ప్రీవియస్ హిట్ ప్రేమమ్ పాతిక కోట్ల మార్క్ ను దాటింది. ఈ సినిమా కూడా ఈ వీక్ అంతా కలిసి ఆ మార్క్ దాటే అవకాశం వుంది. కానీ ఆ తరువాత మాత్రం సమస్య వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే సమ్మర్ హాలీడేస్ అయిపోతాయి. అమీతుమీ. ఆరడుగుల బుల్లెట్ సినిమాలు పోటీకి దిగుతాయి. అందువల్ల మళ్లీ మరోసారి నాగ్ చైతన్య సినిమా హిట్ రేంజ్ అందుకుంటుంది కానీ, ముఫై కోట్ల లోపే ఫిక్సయ్యే అవకాశం వుంది.