సెక్స్‌ అండ్‌ ది సిటీ: ఏ నగరం ఎలా ఎంజాయ్‌ చేస్తోందంటే..!

దాదాపు నాలుగున్నర లక్షల మందితో జరిగిన ఒక లార్జ్‌ సర్వే ఇది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో సెక్సువల్‌ ట్రెండ్స్‌ గురించి ఈ అధ్యయనం సాగింది. ప్రపంచంలో ఏ నగరం సెక్స్‌ విషయంలో ఎలా…

దాదాపు నాలుగున్నర లక్షల మందితో జరిగిన ఒక లార్జ్‌ సర్వే ఇది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో సెక్సువల్‌ ట్రెండ్స్‌ గురించి ఈ అధ్యయనం సాగింది. ప్రపంచంలో ఏ నగరం సెక్స్‌ విషయంలో ఎలా స్పందిస్తోందనే అంశం వివరాలను చెబుతోంది ఈ సర్వే. దాదాపు రెండువందల నగరాల నుంచి సేకరించిన డాటా ప్రకారం ఈ అధ్యయనం సాగిందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.

వీరు చెబుతున్న దాని ప్రకారం… సెక్సువల్‌ పాజిటివిటీలో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది పారిస్‌. ఈ విషయంలో పారిస్‌కు 86.5 మార్కులు పడతాయట. మొత్తం వంద నగరాల జాబితాను ఎంపిక చేస్తే.. అందులో వందో స్థానంలో పొందిన నగరంగా ఐర్లాండ్‌లోని కార్క్‌ నిలిచింది. ఈ టాప్‌ హండ్రెట్‌ జాబితాలో స్థానం సంపాదించడమే గొప్ప గౌరవమట.

సెక్సువల్‌ యాక్టివిటీలో ముందుంది బ్రెజిల్‌ రాజధాని. రియోడి జెనీరో సెక్సువల్‌ యాక్టివ్‌ సిటీస్‌లో నంబర్‌ వన్‌ పొజిషన్లో నిలిచింది. సెక్సువల్‌ ఎక్స్‌ పెరిమెంట్స్‌లో కూడా ఈ నగరం నంబర్‌ వన్‌ పొజిషన్‌లో నిలిచింది.

సెక్సువల్‌ శాటిస్‌ ఫ్యాక్షన్‌ విషయంలో నంబర్‌ పొజిషన్‌లో నిలిచింది బెల్జియంలోని అంట్వ్రెప్‌. ఈ సర్వేలో పాల్గొన్న పార్టిసిపెంట్స్‌లో హ్యాపీ సెక్సువల్‌ లైఫ్‌ విషయంలో ఈ నగర ప్రజలు ముందున్నారట. ఆ తర్వాత వార్సా, బ్రస్సెల్స్‌, ఆమ్‌ స్టార్‌డమ్‌ తదితర నగరాలు సెక్సువల్‌ శాటిస్‌ ఫ్యాక్షన్‌లో ముందున్నాయట.

ఇక పోర్న్‌ విషయానికి వస్తే.. పోర్న్‌ వీక్షణలో ముందుందట అమెరికన్‌ నగర్‌ లాస్‌ ఏంజెలెస్‌. ఎల్‌ఏను పోర్న్‌ ఇండస్ట్రీకి స్వర్గధామంగా కూడా పేర్కొంటారు. కేవలం ఎల్‌ఏ మాత్రమే గాక మరో అమెరికన్‌ నగరం న్యూయార్క్‌ కూడా ఈ జాబితాలో ముందుంది. న్యూయార్క్‌ ది రెండో స్థానం. మూడో స్థానంలో టొరంటో ఉంది.

మరి ఈ సర్వే ఆసాంతం పరిశీలించి చూసినా.. ఇండియన్‌ నగరాల ప్రస్తావన పెద్దగా లేదు. బహుశా ఇండియన్‌ శాంపిల్స్‌ కూడా తక్కువే అయి ఉండవచ్చు. దీంతో భారతీయ నగరాలు ఏ విషయంలోనూ టాప్‌ హండ్రెడ్‌లోనూ నిలవలేకపోయాయి.