రొమాన్స్ కు, బాయ్ ఫ్రెండ్ కు లాస్ట్ ప్రయారిటీ అనేసింది!

ఆమెకు హాలీవుడ్ లో వరసగా అవకాశాలు వస్తుండే సరికి… బాయ్ ఫ్రెండ్ ను కూడా నిర్లక్ష్యం చేసేస్తోంది.. అనే అభియోగం వినిపిస్తోంది దీపిక మీద. ఆమె రేంజ్ పెరిగిపోయే సరికే ఇలా ప్రవర్తిస్తోంది.. ఇన్నాళ్లూ…

ఆమెకు హాలీవుడ్ లో వరసగా అవకాశాలు వస్తుండే సరికి… బాయ్ ఫ్రెండ్ ను కూడా నిర్లక్ష్యం చేసేస్తోంది.. అనే అభియోగం వినిపిస్తోంది దీపిక మీద. ఆమె రేంజ్ పెరిగిపోయే సరికే ఇలా ప్రవర్తిస్తోంది.. ఇన్నాళ్లూ  కలిసి తిరిగి, పబ్లిగ్గానే పలు సార్లు రొమాన్స్ చేసుకున్న రణ్ వీర్ తో ఈ మధ్య అస్సలు కలిసి కనిపించడం లేదు.. అని బాలీవుడ్ పత్రికలు దీపిక మీద  ఫిర్యాదులు చేస్తున్నాయి! ఓవరాల్ గా దీపిక- రణ్ వీర్ ల బంధం తెగిపోయిందనే కామెంట్లు చేస్తున్నాయి!

కొన్నాళ్లు ప్రేమ జంటగా చెలామణీ అయిన దీపిక- రణ్ వీర్ లు విడిపోయారనేది లేటెస్ట్ టాక్. వీళ్ల ప్రేమ గురించి ఎన్ని రకాల వార్తా కథనాలు వచ్చాయో వివరించనక్కర్లేదు. తమ జీవితంలోని కొన్ని బ్రేకప్ ల తర్వాత దీపిక- రణ్ వీర్ లు జత కలిశారు. ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమను బహిరంగంగా వ్యక్తీకరించుకొంటూ వచ్చారు. ఖరీదైన గిఫ్టులు కూడా ఒకరికొకరు ఇచ్చుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఓవరాల్ గా సినీ ప్రేక్షకులు వీరి ప్రేమకథను ప్రత్యేకంగా పరిగణించేంత వరకూ వచ్చింది వ్యవహారం. ఈ నేపథ్యంలో… దీపిక బాలీవుడ్ పరిధిని దాటింది. హాలీవుడ్ లో వరస అవకాశాలతో బిజీ అవుతోంది. మరి సహజంగానే ఆమె.. ముంబైని దాటాల్సి వచ్చింది. ఇలా దాటిన దీపిక రణ్ వీర్ కు అస్సలు అందకుండా పోయిందనే మాట వినిపిస్తోందిప్పుడు. దీంతో వీళ్ల మధ్య దూరం పెరిగిపోయిందని బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది.

ఇదే సమయంలో… దీపిక ను కూడా వివరణ అడగడం జరిగింది. ప్రస్తుతానికి తాను బిజీ అని ఆమె స్పష్టం చేసింది. హాలీవుడ్ అవకాశాలతో కుటుంబ సభ్యులతో గడిపేంత తీరిక కూడా దొరకలేదని ఆమె చెప్పింది. తన జీవితంలో ఇప్పుడు ప్రథమ ప్రాధాన్యత పనికే అని స్పష్టం చేసింది.. బాయ్ ఫ్రెండ్, రొమాన్స్ లకు తన ప్రాధాన్యత ఆఖరే అని దీపిక వ్యాఖ్యానించింది!