కార్తీ.. అది నిజమేనా.?

కార్తీ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో 'చెలియా' సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. బాలీవుడ్‌ బ్యూటీ అదితిరావు హైదరి ఈ సినిమాలో కార్తీ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి తాజా ఖబర్‌ ఏంటంటో,…

కార్తీ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో 'చెలియా' సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. బాలీవుడ్‌ బ్యూటీ అదితిరావు హైదరి ఈ సినిమాలో కార్తీ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి తాజా ఖబర్‌ ఏంటంటో, ఇందులో కార్తీ – అదితి మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ సూపర్‌ హాట్‌గా వుంటుందట. 

నిత్యామీనన్‌, దుల్కర్‌ సల్మాన్‌ కాంబినేషన్‌లో మణిరత్నం తెరకెక్కించిన 'ఓకే బంగారం' సినిమా గుర్తుందా.? అందులో హీరో హీరోయిన్ల మధ్య బీభత్సమైన కెమిస్ట్రీని సృష్టించేశారు మణిరత్నం. ఇప్పుడు అంతకు మించిన కెమిస్ట్రీ కార్తీ – అదితి మధ్య క్రియేట్‌ చేసేశారట. పక్కింటి కుర్రాడులా కన్పించే కార్తీ, తన సినిమాల్లో రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలో కాస్త జాగ్రత్తగానే వుంటాడు. హద్దులు దాటని రొమాన్స్‌ మాత్రమే ఇప్పటిదాకా కార్తీ సినిమాల నుంచి చూశాం. కానీ, ఇప్పుడు కార్తీ కూడా హద్దులు దాటేశాడట. 

ఇక, ఇదే విషయమై హీరోయిన్‌ అదితి స్పందిస్తూ, బాలీవుడ్‌లో తాను గతంలో చేసిన సినిమాలతో పోల్చితే, 'చెలియా' (తమిళంలో 'కాట్ర వెలియుదై' సినిమాలో మరీ అంత ఎక్కువేమీ వుండదనీ, సౌత్‌ వరకూ ఈ రొమాన్స్‌ కాస్త ఇంట్రెస్టింగ్‌గానే అక్కడి ప్రేక్షకులకు అన్పించవచ్చని చెబుతుండడం గమనార్హం. మరోపక్క, కార్తీ మాత్రం తన కెరీర్‌లో ఇదొక స్పెషల్‌ మూవీ అనీ, ఇందులో తన గెటప్, బాడీ లాంగ్వేజ్ దగ్గర్నుంచి, లవ్‌, రొమాన్స్‌ అన్నీ కొత్తగా వుంటాయనీ, సినిమాలో ఏదీ హద్దులు దాటి వుండదని చెబుతున్నాడు. 

ఏమో, అదితి చెప్పింది నిజమో, కార్తీ చెబుతున్నది నిజమో సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. అన్నట్టు, 'చెలియా' సినిమాపై అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ భారీ అంచనాలే వున్నాయి. 'దిల్‌' రాజు ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు.