సీక్వెల్స్‌ అంటే అంత మక్కువ లేదాయనకి

ఒక సినిమా హిట్‌ అయితే దానికి కొనసాగింపుగా ‘పార్ట్‌-2’ తీయడం సినిమా రంగంలో ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఇంగ్లీష్‌ సినిమాలకే గతంలో పరిమితమైన రెండో భాగం సినిమాలు ఇప్పుడు అన్ని భాషల్లోనూ చేస్తున్నారు.…

ఒక సినిమా హిట్‌ అయితే దానికి కొనసాగింపుగా ‘పార్ట్‌-2’ తీయడం సినిమా రంగంలో ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఇంగ్లీష్‌ సినిమాలకే గతంలో పరిమితమైన రెండో భాగం సినిమాలు ఇప్పుడు అన్ని భాషల్లోనూ చేస్తున్నారు. పార్ట్‌-2 తీసి హిట్‌ కొట్టడం కత్తిమీద సాములాంటిదే. అందుకే పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తన గబ్బర్‌సింగ్‌ రెండో భాగం చెయ్యడానికి సంశయిస్తున్నాడంటున్నారు. 

సాధారణంగా పార్ట్‌ వన్‌లో వున్న జీవం పార్ట్‌ టూలో కనిపించకపోతే వృధా ప్రయాస అవుతుంది. పవన్‌కళ్యాణ్‌ లాంటి స్టార్‌ హీరోకు ప్రతి సినిమా కొత్తగా వుండాలి. పార్ట్‌2 చేయాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఆయన ఖుషీ, తొలి ప్రేమ సినిమాలను రెండో భాగం చేద్దామంటే తిరస్కరించిన సందర్భాలు కూడా వున్నాయట. గబ్బర్‌సింగ్‌ సినిమా హిట్‌ అవడానికి పవన్‌కళ్యాణ్‌ వేసిన మాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ బాగా హెల్ప్‌ అయ్యింది. 

చొక్కా బటన్స్‌ వదిలేసి, యూనిఫాం పరువు తీశాడని విమర్శలు వున్నా పవన్‌కళ్యాణ్‌కి వున్న ఫాలోయింగ్‌తో ఆ సినిమా హిట్‌ అయ్యింది. ఇప్పుడు రెండో పార్ట్‌లో కూడా అలాంటి స్టయిల్‌ని కంటిన్యూ చేస్తే చూస్తారా.? కథని పొడిగించి ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టొచ్చా.? గబ్బర్‌సింగ్‌ సినిమాకి అంత్యాక్షరి సాంగ్‌ హెల్పయ్యింది. పార్ట్‌-2లో దాన్ని కంటిన్యూ చెయ్యలేరు. ఇవన్నీ పవన్‌కళ్యాణ్‌ని వేధించే ప్రశ్నలు. అందుకే ప్రాజెక్ట్‌ లేటవుతుందంటున్నారు.