రూ.5 కోట్లు కారు బహుమతిగా అందుకుంది

ఖరీదైన గిఫ్టులు అందుకోవడం జాన్వికి కొత్తేం కాదు. గతంలో ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా జాన్వికి ఖరీదైన డైమండ్ నెక్లెస్, కార్లు ఇచ్చాడు.

హీరోయిన్లకు కేవలం రెమ్యూనరేషన్లు మాత్రమే కాదు, ఖరీదైన బహుమతులు కూడా వస్తుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని బహుమతులు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇది అలాంటిదే.

జాన్వి కపూర్ ఓ ఖరీదైన కారును బహుమతిగా అందుకుంది. దాని ఖరీదు అక్షరాలా 5 కోట్ల రూపాయలు. ఇంత ఖరీదైన బహుమతిని ఆమెకు ఇచ్చింది ఎవరో తెలుసా? ఆమె బిర్లా వారసురాలు.

కుమార మంగళం బిర్లా, నీర్జా బిర్లా దంపతుల కుమార్తె అనన్య బిర్లా. జాన్వి కపూర్, అనన్య చాన్నాళ్లుగా మంచి స్నేహితులు. తమ స్నేహానికి గుర్తుగా, అనన్య బిర్లా, జాన్వీకి ఈ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చింది.

కారుతో పాటు 6 అడుగుల పెద్ద పార్శిల్ ను కూడా పంపించింది అనన్య బిర్లా. అందులో ఏముందనేది బయటకురాలేదు.

ఇలాంటి ఖరీదైన గిఫ్టులు అందుకోవడం జాన్వికి కొత్తేం కాదు. గతంలో ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా జాన్వికి ఖరీదైన డైమండ్ నెక్లెస్, కార్లు ఇచ్చాడు.

6 Replies to “రూ.5 కోట్లు కారు బహుమతిగా అందుకుంది”

Comments are closed.