సెక్సీ పిక్.. గోల్ సెట్ చేసిన క‌త్రినా, విక్కీ!

బీచ్ ల అందాల‌తో పోటీ ప‌డేలా త‌న అందాల‌ను ఆర‌బోస్తూ అంద‌మైన ఫొటోల‌ను దిగి ఫాలోయ‌ర్ల‌కు బ‌హుమ‌తిగా పోస్టు చేస్తూ వ‌స్తున్న బాలీవుడ్ న‌టి క‌త్రినాకైఫ్ ఈ సారి స్విమ్మింగ్ పూల్ ను వేడెక్కించింది. …

బీచ్ ల అందాల‌తో పోటీ ప‌డేలా త‌న అందాల‌ను ఆర‌బోస్తూ అంద‌మైన ఫొటోల‌ను దిగి ఫాలోయ‌ర్ల‌కు బ‌హుమ‌తిగా పోస్టు చేస్తూ వ‌స్తున్న బాలీవుడ్ న‌టి క‌త్రినాకైఫ్ ఈ సారి స్విమ్మింగ్ పూల్ ను వేడెక్కించింది. 

త‌న భ‌ర్త విక్కీ కౌశ‌ల్ తో రొమాంటిక్ పోజుతో ఇన్ స్టాలో అల‌జ‌డి రేపుతోంది క‌త్రినా.  మేక‌ప్ లెస్ తో జంట‌గా సేద‌తీరుతున్న ఈ దంప‌తులు త‌మ సెక్సీ పోజుతో త‌మ ఫాలోయ‌ర్ల‌కు సెక్సీ గోల్ ను సెట్ చేశారు. 

ఇలాంటి రొమాంటిక్ మొమెంట్స్ ను ఎవ‌రైనా కోరుకునే రీతిలో ఉంది వారి పోజు. క‌త్రినా త‌న ఇన్ స్టాగ్ర‌మ్ అకౌంట్లో ఈ పోస్టును పెట్టింది. నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ పోస్టు కు ల‌క్ష‌ల్లో లైకులు రావ‌డం మొద‌లైంది. 

వీకెండ్ లో వీరి రొమాంటిక్ పోజు ఇంట‌ర్నెట్ లో ట్రెండింగ్ ఫొటోల్లో ఒక‌టిగా మారింది. ఇప్ప‌టికే త‌న ఇన్ స్టాగ్ర‌మ్ అకౌంట్లో క‌త్రినా బోలెడ‌న్ని సెక్సీ పిక్స్ ను పోస్టు చేస్తూ వ‌స్తోంది. 

ప్ర‌త్యేకించి బీచ్ ల‌లో క‌త్రినా పోజులు అదిరిపోయే లెవ‌ల్లో ఉంటాయి. బీచ్ బేబీ, వాట‌ర్ బేబీ అవ‌తారాల్లో క‌త్రినా త‌న ఫాలోయ‌ర్ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది.