పాకిస్తాన్‌ ఇంటికి.. ఆసీస్‌ సెమీస్‌కి

భారత ఉప ఖండంలోని మరో టీమ్‌ వరల్డ్‌ కప్‌ పోటీల నుంచి తప్పుకుంది. ఉప ఖండంలోని నాలుగు జట్లు టీమిండియా, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కి చేరినా, అందులో మూడు జట్లు ఇంటిదారి…

భారత ఉప ఖండంలోని మరో టీమ్‌ వరల్డ్‌ కప్‌ పోటీల నుంచి తప్పుకుంది. ఉప ఖండంలోని నాలుగు జట్లు టీమిండియా, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కి చేరినా, అందులో మూడు జట్లు ఇంటిదారి పట్టాయి. డిఫెండిరగ్‌ ఛాంపియన్‌ టీమిండియా ఇప్పటికే సెమీస్‌లోకి అడుగుపెట్టిన విషయం విదితమే.

తాజాగా ఈ రోజు ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓటమి చవిచూసింది. దాంతో పాకిస్తాన్‌ ఇంటిదారి పట్టగా, ఆసీస్‌ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. మార్చ్‌ 26న టీమిండియా ` ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్‌ పోరు జరగనుంది. రేపు న్యూజిలాండ్‌ ` వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే పోరులో గెలిచే టీమ్‌, మార్చ్‌ 24న సౌతాఫ్రికాతో సెమీస్‌లో తలపడనుంది.

ఆస్ట్రేలియా ` పాకిస్తాన్‌ మ్యాచ్‌ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌, 49.5 ఓవర్లకు 213 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. లక్ష్యం చిన్నదే అయినా ఆరంభంలో వికెట్లు కోల్పోయిన ఆసీస్‌, కాస్త కంగారు పడిరది. ఆ తర్వాత తేరుకుని, లక్ష్యాన్ని కేవలం 33.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో ఆసీస్‌ 4 వికెట్లు కోల్పోయింది.

4 వికెట్లు తీసి పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ని దెబ్బ కొట్టిన ఆస్ట్రేలియా బౌలర్‌ హేజెల్‌వుడ్‌కి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ విషయానికొస్తే స్టీవ్‌ స్మిత్‌ జట్టు కష్టాల్లో వున్న సమయంలో ఆదుకున్నాడు. 65 పరుగులు చేసి ఔటయ్యాడు స్మిత్‌. షేన్‌ వాట్సన్‌ 64 పరుగులు చేయగా, మ్యాక్స్‌వెల్‌ 29 బంతుల్లో 44 పరుగులు చేసి స్కోర్‌ బోర్డ్‌ని పరుగులు పెట్టించాడు.