Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : బాపు విశ్వరూపం- 2

ఎమ్బీయస్‌ : బాపు విశ్వరూపం- 2

గతంలో గ్రీటింగు కార్డులు జనవరి 1 కి మాతమ్రే పంపేవారు.  క్రిస్‌మస్‌, న్యూ ఇయర్‌ కలిపి ఉండేవి కాబట్టి శాంతాక్లజ్‌, చర్చి గంటలు, రిబ్బన్లు, చెరీప్రళ్లు, మంచుతో కప్పబడిన క్రిస్‌మస్‌ చెట్లు - ఇవి ఉన్న గ్రీటింగ్స్‌ కార్డులే దొరికేవి.

వీటిలో ఏవీ మన వాతావరణానికి సంబంధించినవి కావు. 1975 పాంతాల్లో గీట్రింగు రంగంలోకి బాపు ప్రవేశించడంతో ఇదంతా మారిపోయింది. మన సంస్కృతిని ప్రతిబింబించే, మనను మనం ఐడెంటిఫై చేసుకోగలిగే గ్రీటింగులు మార్కెట్లోకి వచ్చాయి. సంక్రాంతి, ఉగాది, దీపావళి వంటి మన పండుగలకు గ్రీటింగ్సు పంపుకోగలిగే వెసులుబాటు కలిగింది. 

 అప్పటిదాకా హరిదాసు బొమ్మలు, గొబ్బిళ్ల బొమ్మలు ఎవరూ వేయలేదని కాదు. పతిక్రలలో అనేకం వచ్చేవి. కానీ గ్రీటింగు కార్డులకు కావలసిన  ఫ్రేమింగ్‌్‌, కటింగ్‌, వాటిలో ఉండేది కాదు. అలా చేయగలిగిన ఘనత బాపుదే! ఆ అదృష్టం మన తెలుగుసంస్కృతిదే! ఎందుకంటే దీపావళికి ఉత్తరభారతంలో లభించే అసంఖ్యాకమైన గ్రీటింగులు చూడండి. వాటిల్లో దీపం బొమ్మో, దేవీదేవతామూర్తుల బొమ్మో తప్ప దీపావళి జరుపుకునే జనసామాన్యం కనబడరు. వాళ్లు 'సేలబుల్‌' కాదేమో వారి దృష్టిలో!

తెలుగునాట సంకాంతి ఎలా జరుపుకోబడుతుందో చక్కటి బొమ్మలు వేసి 'సేలబుల్‌' చేసిన బాపు గ్రీటింగ్సులో కొన్ని చూడండి.

సంక్రాంతి లక్ష్మి, ముగ్గులు పెట్టే బాపు మార్కు ముద్దుగుమ్మలు, గొబ్బెళ్లు ఆడే పల్లెపడుచులు, సంక్రాంతి వాతావరణం మొత్తం కనబడే దృశ్యం - హరిదాసు, డూడూ బసవన్నలతో సహా -,  పంట ఇంటికి తెచ్చుకున్న రౖౖెతు కుటుంబం (వెనుక తివాచీ డిజైన్లో అమరిపోయిన ఎద్దులను 'మిస్‌' చేయకండి), పండక్కి వచ్చే భర్తకోసం ఎదురుచూసే నవవధువు, - అన్నీ బాపు కుంచెలో ఎలా రూపు దిద్దుకున్నాయో చూడండి. 

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]

Click Here For Part-1

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా