భారతీయుడికి నోబెల్‌ శాంతి పురస్కారం

అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ శాంతి పురస్కారం ఓ భారతీయుడికి దక్కింది. భారతదేశానికి చెందిన కైలాస్‌ సత్యార్థి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. కైలాస్‌ సత్యార్ధి మహారాష్ట్రలోని విదిశ ప్రాంతానికి చెందినవారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్నారు…

అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ శాంతి పురస్కారం ఓ భారతీయుడికి దక్కింది. భారతదేశానికి చెందిన కైలాస్‌ సత్యార్థి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. కైలాస్‌ సత్యార్ధి మహారాష్ట్రలోని విదిశ ప్రాంతానికి చెందినవారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్నారు గడచిన పాతికేళ్ళుగా ఈయన. కైలాస్‌ సత్యార్థి, బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ అనే ఉద్యమ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ తరఫున అనేక పోరాటాలు చేసిన సత్యర్థి, 80 వేల మంది బాలలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించారు.

కాగా, కైలాస్‌ సత్యార్థితోపాటు నోబెల్‌ శాంతి బహుమతిని పాకిస్తానీ బాలిక మలాలాకూ ప్రకటించారు. కైలాస్‌ సత్యార్థి, మలాలా సంయుక్తంగా నోబెల్‌ శాంతి పురస్కారాన్ని అందుకోనుండడం విశేషం. భారత్‌, పాకిస్తాన్‌ సంయుక్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలనే ఉద్దేశ్యంతో ఇరు దేశాలకు చెందినవారికి శాంతి బహుమతిని నోబెల్‌ జ్యూరీ ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే, నోబెల్‌ శాంతి బహుమతి అందుకోనున్న కైలాస్‌ సత్యార్థి, ఈ పురస్కారానికి ఎంపికైన ఏడో భారతీయుడు. కైలాస్‌ సత్యార్ధికి నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల యావత్‌ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. వివిధ రాజకీయ పార్టీలు కైలాస్‌ సత్యార్థి సేవల్ని కొనియాడుతున్నారు.