గత రెండు మూడు నెలలుగా కర్ణాటక రాష్ట్రం సెక్స్ స్కాముల వార్తలతో నిలుస్తూ ఉంది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం ముందుగా దుమారం రేపింది! ప్రజ్వల్ రేవణ్ణ కొన్ని వందల మంది మహిళలతో రమిస్తూ వీడియోలను చిత్రీకరించుకున్నాడనే వార్తలు వచ్చాయి. అందుకు సబంధించిన వీడియోలను ఆయన పెన్ డ్రైవ్ లో దాచి పెట్టుకుని ఉండటం, ఆ పెన్ డ్రైవ్ వెలుగు చూడటంతో దానిపై కేసులు నమోదయ్యాయి. అప్పటికి హోదాలో అలా ప్రజ్వల్ రేవణ్ణ అకృత్యాలు దుమారం రేపాయి. దానిపై కేసుల్లో అరెస్టుకు ముందు ప్రజ్వల్ జర్మనీకి పరారు అయ్యాడు.
2024 ఎన్నికల్లో హసన్ నుంచినే ఎంపీగా పోటీలో ఉండిన ప్రజ్వల్ పోలింగ్ పూర్తి కాగానే పరార్ అయ్యాడు. మళ్లీ రిజల్ట్స్ విడుదల వరకూ ఆయన ఇండియా రాలేదు. దీంతో ఆయన వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా నిలిచింది. జేడీఎస్ తో బీజేపీ కూడా పొత్తులో ఉండటంతో.. ఈ ఉదంతం ఎన్డీయే ఎంపీ అభ్యర్థిదిగా మారింది. జాతీయ స్థాయిలో చర్చలో నిలిచింది. ప్రత్యేకించి ప్రజ్వల్ అలా వీడియోలను దాచి ఉంచడం పైత్యకారానికి నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం ప్రజ్వల్ బెంగళూరులోని జైల్లో ఉన్నాడు. ఇదే కేసులో ఆయన తండ్రి, తల్లి కూడా విచారణను ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం!
ప్రజ్వల్ అంకుల్ కుమారస్వామి ఇటీవలే మోడీ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. మరి ప్రజ్వల్ ఉదంతం ఎక్కడికి వెళ్తుందో అనే చర్చ జరుగుతూ ఉండగానే.. అంతకు మించిన సంచలన సెక్స్ స్కామ్ వెలుగులోకి వచ్చింది అదే కర్ణాటకలో!
కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమాని ఒకడిని హత్య చేయించిన వ్యవహారం పెను సంచలనంగా మారింది. గతంలో సినిమా హీరోలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం జరిగింది. తెలుగు స్టార్ హీరో బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఉదంతం అప్పట్లో దుమారం రేపింది. తన ఇంట్లోనే బాలకృష్ణ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరపడం సంచలనంగా నిలిచింది. అయితే బాలకృష్ణ అప్పట్లో తన మతిస్థిమితం సరిగా లేదని తప్పించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మలయాళీ స్టార్ హీరో దిలీప్ కూడా తనకు తలనొప్పిని తెచ్చిపెట్టిన ఒక హీరోయిన్ పై అకృత్యానికి పాల్పడించాడనే ఆరోపణలు వచ్చాయి.
దిలీప్ చాన్నాళ్లు పాటు జైల్లో ఉండి బయటకు వచ్చాడు, కేసు విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు దర్శన్ వంతు. తన సన్నిహితురాలిని మెసేజ్ లతో వేధిస్తున్నాడనే మిషతో తన అభిమానిని దర్శన్ దగ్గరుండి హత్య చేయించాడనే కేసు నమోదు అయ్యింది. చాలా పటిష్టమైన ఆధారాలతో దర్శన్ దొరికిపోయాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆయనను అరెస్టు చేశారు. ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశాలు దర్శన్ కు లేనట్టుగా ఉన్నాయి.
దర్శన్ తీరుకు తోడు అతడి వీరాభిమానుల అతి మరింత ఓవర్ గా ఉంది. దర్శన్ ను అరెస్టు చేయనే వద్దని, అతడి తప్పేం లేదంటూ ఆయన వీరాభిమానులు ఓపెన్ గా వాదిస్తూ తమ మూర్ఖత్వాన్ని చాటుకుంటూ ఉన్నారు. తమ అభిమాన హీరో ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు, ఎన్ని కాపురాలు అయినా చేయొచ్చు, ఎవరినైనా మర్డర్ చేయించొచ్చు అన్నట్టుగా ఉంది సినిమా హీరోల వీరాభిమానుల మానసిక పరిస్థితి!
ఇదంతా ఇలా ఉండగానే.. యడియూరప్పపై కూడా ఆరోపణలు గుప్పుమన్నాయి. ముదసలిగా మారిన ఈ కర్ణాటక మాజీ సీఎం ఒక మైనర్ బాలికపై లైంగికవేధింపులకు పాల్పడ్డాడు అనేది ఆరోపణ. ఈ విషయంలో 17 యేళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యడియూరప్పపై ఫోక్సో చట్టం కేసు నమోదు అయ్యింది. ఆయనను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ఈ రాజకీయ వృద్ధుడు, ఇటీవలి లోక్ సభ ఎన్నికల సందర్భంలో కూడా క్రియాశీలకంగా పని చేశారు. ఇలాంటి నేపథ్యంలో.. ఆయన వార్తలు కూడా దుమారం రేపుతున్నాయి!
ఒక మాజీ పీఎం మనవడు కమ్ ఒక మాజీ ఎంపీ, ఒక స్టార్ హీరో, ఇంకో మాజీ ముఖ్యమంత్రి ఇలా ముగ్గురూ సంచలనాత్మకమైన సెక్స్ కేసుల్లో ఇరుక్కొని వార్తల్లో నిలుస్తున్నారు. కర్ణాటక మీడియాలో వీరి ముచ్చట్లే పతాక శీర్షికలుగా కొనసాగుతూ ఉన్నాయి. గతంలోనూ ఇలాంటి స్కామ్ లకు లోటు లేదక్కడ. అసెంబ్లీలో కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు పోర్న్ చూడటం, ఆ తర్వాత మరో ఎమ్మెల్యే ఒక యువతితో లైంగిక చర్యను వీడియోగా దుమారం రేపడం జరిగింది. ఇప్పుడు అంతకు మించిన కేసులు అక్కడ వార్తల్లో నిలుస్తున్నాయి.
టీడీపీ అరాచకాలు మొదలయ్యాయి
* వైజాగ్ గాంధీ హాస్పిటల్ ని HCG గ్రూప్ కి 714 కోట్లకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం*
వైజాగ్ లో ఉన్న 196 బెడ్ ల మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్ ని 414 కోట్లకి 54% షేర్ ని HCG గ్రూప్ సంస్థకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ నూతన కూటమి ప్రభుత్వం
మరో 34% షేర్ ని రాబోయే 18 నెలల కాలం లో అదే HCG గ్రూప్ కి 300 కోట్ల కి అమ్మకానికి ఒప్పందం
గమనిక: ఈ హాస్పిటల్ 2024 సంవంత్సరం లో ఆదాయం 162.4 కోట్లు
ఇంత ఆదాయం ఉన్న హాస్పటల్ ని కేవలం 714 కోట్లకి ప్రైవేట్ సంస్థకి అమ్మేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది
గత ప్రభుత్వం లో కొత్తగా హాస్పిటల్ లు మెడికల్ కాలేజీ లు – పలాస లో కిడ్నీ రెసర్చ్ సెంటర్ మరియు కిడ్నీ కేర్ హాస్పిటల్ కడితే- నూతన కూటమి ప్రభుత్వం హాస్పిటల్ లు అమ్మేయడం విడ్డురాం గా ఉంది
ఇక వైజాగ్ వాసులు- ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉచిత వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతుంది- దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి ( దీనిని ప్రశ్నించడానికి ప్రతిపక్షం లేకపోవడం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కి కలిసివస్తుంది)
సోర్స్: ఎకనామిక్స్ టైమ్స్ అఫ్ ఇండియా
పుణ్యం పురుషార్డం. ఇలాంటివి ఎన్నో చుటబోతున్నం వచ్చే 5 ఏళ్లలో… భారత్ బీజేపీ అంబానీ అడానిలకు కట్ట బెట్టినట్లు, ఇప్పటివరకు రాష్ట్రం లో 65% ఆస్తులు ఒక సామాజిక వర్గానికి కట్ట బెడితే, వచ్చే 5 ఏళ్లలో ఈ 65% నీ 80% తీసుకెళితే, జీవితం లో టీడీపీ నే ప్రభుత్వం వస్తూనే వుంటుంది..ఎందుకంటే కార్పొరేట్ మరియు రాష్ట్ర ఆస్తులు మొత్తం వాళ్ళ చేతిలో వుంటాయి… ఇదే జరిగితే, మిగతా 90% మంది ఓ 5% వర్గానికి బానిసల గా మారి పోతారు… ఇది ప్రజలకు అర్దం అయ్యే లోపల అసెట్లు అన్ని వాళ్ళ చేతిలోకి వెళ్లి పోతాయి… అప్పుడు వాళ్లకు వోటోసి న ప్రతి వాడికి అర్దం అయిన వాడి జీవితం బానిసత్వం మాత్రమే…
K-batch దోపిడీ మొదలు
పుణ్యం పురుషార్డం. ఇలాంటివి ఎన్నో చుటబోతున్నం వచ్చే 5 ఏళ్లలో… భారత్ బీజేపీ అంబానీ అడానిలకు కట్ట బెట్టినట్లు, ఇప్పటివరకు రాష్ట్రం లో 65% ఆస్తులు ఒక సామాజిక వర్గానికి కట్ట బెడితే, వచ్చే 5 ఏళ్లలో ఈ 65% నీ 80% తీసుకెళితే, జీవితం లో టీడీపీ నే ప్రభుత్వం వస్తూనే వుంటుంది..ఎందుకంటే కార్పొరేట్ మరియు రాష్ట్ర ఆస్తులు మొత్తం వాళ్ళ చేతిలో వుంటాయి… ఇదే జరిగితే, మిగతా 90% మంది ఓ 5% వర్గానికి బానిసల గా మారి పోతారు… ఇది ప్రజలకు అర్దం అయ్యే లోపల అసెట్లు అన్ని వాళ్ళ చేతిలోకి వెళ్లి పోతాయి… అప్పుడు వాళ్లకు వోటోసి న ప్రతి వాడికి అర్దం అయిన వాడి జీవితం బానిసత్వం మాత్రమే…
రాష్ట్రం లో ఇసుక తప్ప ఏమి ఆస్తులు లేవు. అంత దారుణమైన స్థితి లో ఉన్నాం. దానికి కారణం R batch.
ప్రతి మంగళవారం అప్పు
అని జగన్ మీద విషం చిమ్మిన ఈనాడు జ్యోతి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు
(జూన్ 12 న బాబు ప్రమాన శ్వీకారం చేశారు
జూన్ 25 న (మంగళవారం) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో
2 వేల కోట్లు అప్పు చేసిన బాబు ప్రభుత్వం
జులై 2 (మంగళవారం ) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో
5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం
అంటే 20 రోజుల్లో 7 వేల కోట్ల అప్పు
ఆ విధంగా సంపద సృష్టిలో తలమునకలై ఉన్న విజనరీ బాబు )