విరాట్ ఇన్‌స్టా పోస్ట్ ఎన్ని కోట్లో తెలిస్తే…

టీమ్ ఇండియా ర‌థ‌సార‌థి విరాట్ కోహ్లీ ఆట‌లోనే కాదు, ఆర్జ‌న‌లోనూ త‌న‌కు సాటిలెర‌వ‌రూ అని చాటి చెబుతున్నారు. ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు విరాట్ రూ.5 కోట్లు తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ…

టీమ్ ఇండియా ర‌థ‌సార‌థి విరాట్ కోహ్లీ ఆట‌లోనే కాదు, ఆర్జ‌న‌లోనూ త‌న‌కు సాటిలెర‌వ‌రూ అని చాటి చెబుతున్నారు. ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు విరాట్ రూ.5 కోట్లు తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న టాప్‌-20లో విరాట్ చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం.

ఇటీవ‌ల ‘ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌లిస్ట్‌’ పేరుతో హాపర్‌హెచ్‌క్యూ 2021 అనే సంస్థ ఓ జాబితా విడుద‌ల చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్న సెల‌బ్రిటీల పేర్ల‌ను స‌ద‌రు సంస్థ వెల్ల‌డించింది. 

ఈ జాబితాలో ఏకైక క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ మాత్ర‌మే ఉండ‌డం విశేషం. ఈయ‌న ఒక్కో పోస్టుకు రూ.5 కోట్లు తీసుకుంటూ 19వ స్థానంతో స‌రిపెట్టుకున్నాడు.

ఫుట్‌బాల్ స్టార్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో భార‌త్ క‌రెన్సీ ప్ర‌కారం ఒక్కో పోస్టుకు రూ.11 కోట్ల‌కు పైగా తీసుకుంటూ మొద‌టి స్థానంలో నిలిచారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఆటగాడు, హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ డ్వేన్‌ జాన్సన్ కూడా ఇంచుమించు రూ.11 కోట్లు తీసుకుంటూ రెండో స్థానంలో ఉన్నారు. 

ముఖ్యంగా టాప్‌-20లో ఫుట్‌బాల్ క్రీడాకారులే ఎక్కువ ఉండ‌డం విశేషం. అర్జెంటీనా ఆటగాడు లయోనల్‌ మెస్సీ రూ.8.6 కోట్లు, బ్రెజిల్‌ స్టార్‌ నెయ్‌మార్‌ రూ6.1 కోట్లు తీసుకుంటున్నార‌ని స‌ద‌రు సంస్థ వెల్ల‌డించింది.