2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ వేదికగా ఆడబోమని ప్రకటించిన పాకిస్తాన్ మాట మార్చినట్లు తెలుస్తోంది. తాజాగా చెన్నై, కోల్‌కతాలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు తమ మ్యాచ్‌లలో ఎక్కువ భాగం ఆడేందుకు ఇష్టపడుతున్నట్లు ఐసీసీ ఉన్నతాధికారులతో పాక్ క్రికెట్ బోర్డు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ రెండు నగరాలు తమ జట్టుకు సురక్షితంగా భావించినట్లు తెలుస్తోంది.
కాగా 2023 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ అక్టోబర్ 5 న ప్రారంభం కానుంది. ఫైనల్‌తో సహా 46 మ్యాచ్‌లను జరగనున్నాయి. భారతదేశంలోని 12 నగరాల్లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్ మరియు ముంబైలలో మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ 2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
గతంలో పాకిస్థాన్ జట్టు తన ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లను భారత్‌లో కాకుండా బంగ్లాదేశ్‌లో ఆడబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఆసియా కప్ పాకిస్తాన్ లో జరుగుతున్న దృష్టా భారత్ కూడా పాకిస్తాన్ వెళ్లకుండా బంగ్లాదేశ్‌లో ఆడాలని భావించింది. బహుశా వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం పాక్ భారత్ కు వస్తే భారత్ కూడా పాకిస్తాన్ లో ఆడేందుకు ఆవకాశం ఉండనుంది.
కాగా 2011 ప్రపంచ కప్ సందర్భంగా, మొహాలీలో భారత్‌తో పాకిస్తాన్ సెమీ-ఫైనల్ ఆడింది, అప్పట్లో క్రికెట్ అభిమానుల కోసం వాఘా బోర్డర్ గుండా ప్రయాణించేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించారు. అయితే, బీసీసీఐ ఖరారు చేసిన 12 వేదికల్లో మొహాలీ పేరు లేదు. భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ల కోసం అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.