మనం తీసుకునే ఆహారమే పరమౌషధం అని వైద్యులు చెబుతూ ఉంటారు. ఒకటని కాదు.. అనేక విషయాలు, మన ఉద్వేగాలు కూడా ఆహారం మీద ఆధారపడి ఉంటాయని నవీన పరిశోధకులు చెబుతూ ఉంటారు. తెలుసుకుని గమనిస్తే.. ఈ విషయం అందరికీ అర్థమవుతుందని అంటారు. అరటి పండును స్ట్రెస్ రిలీవర్ గా చెబుతుంటారు.
వర్క్ స్ట్రెస్ తో ఇబ్బంది పడే వారు సాయంత్రవేళ ఒక అరటి పండు తింటే, మనసును అదుపు తప్పేలా చేసే చాలా ఆలోచనలు కాస్త తగ్గుముఖం పట్టి, తెలియకుండానే రిలాక్సేషన్ లభిస్తుంది. ఇది కేవలం ల్యాబుల్లో పరిశోధించి చెప్పే మాటే కాదు, గమనిస్తే కొంతమందికి అయినా ఈ భావన కలుగుతుంది. కొన్ని ఎక్సెప్షన్ కేసులుంటాయి. వారిని ఏం చేయలేం!
ఇలా సృష్టి నుంచి లభించే రకరకాల ఫ్రూట్స్ మనిషిని మానసికంగా ప్రభావితం చేయగలవు. అలాగే మనిషిలోని వివిధ రకాల సామర్థ్యాలను కూడా తినే ఆహారమే ప్రభావితం చేయగలదు. ఇది కూడా రుజువవుతున్న అంశమే. సెక్సువల్ డిజైర్స్ వంటివి వాటి మీద అయితే ఆహారం ప్రభావం కూడా ఉంటుంది.
ఆహారమే సెక్స్ కోరికలను నియంత్రిస్తుంది అని చెప్పలేరు కానీ, ఆహారం ప్రభావం కూడా ఉండే వ్యవహారం ఇది. ఈ విషయంలోనే కాఫీ కూడా ప్రభావితం చూపిస్తుంది అంటోంది ఒక అధ్యయనం. ఎంతలా అంటే.. కాఫీ డ్రింకర్స్ ఆర్ బెటర్ ఇన్ బెడ్స్ అనేది ఈ స్టడీ సారాంశం.
ఇంతకీ ఈ అధ్యయనం ప్రస్తావించే లాజిక్స్ ఏమిటంటే, కాఫీలోని కెఫిన్ వల్ల సహజంగానే శరీరం ఉత్తేజితం అవుతుంది. చాలా మంది శరీరాలకు కాఫీ ఒక ఉత్ప్రేరకం లాంటిది! టీ కి కూడా ఈ శక్తి ఉంటుంది. ఇక్కడ కాఫీ విషయాన్నే ప్రస్తావించారు. ఎక్సర్సైజ్ కు ముందు కానీ, ఆఫీసులో పని సమయంలో కానీ, ఎప్పుడైనా కానీ ఒక కాఫీ పడితే ఉత్తేజితంగా పని చేయగలవారు ఎంతో మంది ఉంటారు.
కాఫీలోని కెఫిన్ వారి శరీరంలోనే తాత్కాలికంగా ఆ ఊపు తీసుకురాగలదు. అలాగే సెక్స్ విషయంలో కూడా మగాళ్లను ఉత్తేజితం చేయగల శక్తి కాఫీగా ఉంటుందని ఆ ఎగ్జాంపుల్స్ ను ఉదాహరిస్తూ చెబుతోంది ఈ అధ్యయనం. కెఫిన్ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుందని ఈ అధ్యయనకర్తలు వివరిస్తున్నారు.
కాఫీ నుంచి వచ్చే సువాసన స్ట్రెస్, అలసటను ఒక్కసారిగా దూరం చేయగలదని వారు చెబుతున్నారు. కాఫీ నుంచి వెలువడే ఆరోమా స్ట్రెస్ ను మటుమాయం చేసి, మూడ్ నే మార్చేయగలదని ఇది వరకూ కొన్ని పరిశోధనలు చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. స్ట్రెస్ తక్కువగా ఉండటం అనేది బెటర్ సెక్స్ కు కీ అని కాబట్టి.. ఒత్తిడిని తగ్గించి శృంగార ఆలోచనలను రేకెత్తించడంలో కాఫీ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.
కాఫీ సెక్సువల్ డిజైర్ ను పెంచుతుందని, అలాగే స్టామినాను కూడా పెంపొందింపజేస్తుందని, దాని వాసనే గొప్ప పవర్ అని ఈ పరిశోధనకర్తలు చెబుతున్నారు. అయితే అలాగని కాఫీని ఏ వయాగ్రాతోనో పోల్చడం లేదు. రోజుకు మూడు కప్పుల వరకూ కాఫీ దుష్ప్రభావాలు లేనిదే అంటున్నారు.
కాఫీని మంచి ప్రీ సెక్స్ డ్రింక్ గా అభివర్ణిస్తున్న ఈ పరిశోధకులు.. అలాగని తాము ఇతర ఎక్కువ షుగర్ ఉండే కెఫిన్ డ్రింకులను ఈ కేటగిరిలోకి కలపడం లేదని అంటున్నారు. సోడాలు, ఓవర్ స్వీటెన్ కాఫీలు, ఫిజ్జీ డ్రింకులు ఈ కేటగిరిలో ఉండని వారు కచ్చితంగా చెబుతున్నారు. సెక్స్ కు బూస్టప్ ఇచ్చే డ్రింకం అంటే.. అరోమాను వెదజల్లే చక్కటి కాఫీ మాత్రమే అని వివరిస్తున్నారు.