నూటికో కోటికో ఒక్కరూ.. అది మీరే మీరే మాస్టారూ అన్నట్లుగా ప్రపంచంలోని శృంగార చిత్రాల తారల్ని వడపోస్తే, తమ నీలి చిత్రాలతో ప్రపంచ శృంగార పురుషుల్ని రంజింపజేసిన తొమ్మిదో తారగా సన్నీలియోన్ ఎంపిక అయ్యిందట. మన భారత సంతతికి చెందిన సన్నీలియోన్ సాధించిన ఈ ఘనతని మనం పబ్లిక్‌గా చెప్పుకుని పండగ చేసుకోలేకపోయినా, మన సన్నీలియోన్ కూడా వుండటం చాటుగా అభినందించదగ్గ విషయమే.
వెయ్యి విధాలుగా వెర్రిని చెప్పుకుంటారు. పాశ్చాత్యులు శృంగారం చేసుకోవడాన్నీ, చెప్పుకోవడాన్నీ తప్పుగా చూడరు. పైగా అందులో అత్యంత ప్రతిభా పాటవాలు కలిగిన వాళ్ళని గుర్తించి వాళ్ళని తగిన రీతిన సత్కరించీ ఆనందిస్తారు. ఇప్పుడు సన్నీలియోన్ ఇలాంటి సత్కారాలకు దూరంగానే వుంటుంది.. అని చెప్పుకుంటున్నారు. తేలు కుట్టిన దొంగలా వుంది ఆమె పరిస్థితి.
హిందీ సినిమాల్లో సరికొత్త పాత్రల్లో మెరిసి, మెల్లగా తన ‘బ్లూ’ ఇమేజ్‌ని తుడిచేసుకుంటున్న ఈ టైమ్‌లో మళ్ళీ సిగ్గులేని కిరీటాలు పెట్టించుకోవడానికి ఆమె ఇష్టపడకపోవచ్చు. యవ్వనం ఒక ఫాంటసీ. అనుభవం ఒక ఆవిరి. చింతామణి లాంటి వేశ్య కూడా ఆఖరున కృష్ణతత్వంలో పడి జీవితాన్ని చరితార్ధకం చేసుకున్నట్లు సన్నీలియోన్ కూడా చేసుకోక తప్పదు.