దిల్ రాజు లాంటి నిర్మాత రంగంలోకి దిగి కూడా వెనుకంజ వేసేసిన ప్రాజెక్టు ఒకటి వుంది. ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ ను హీరోగా లాంచ్ చేసే ప్రాజెక్టు. సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు అయిన ఈ కుర్రాడిని లాంచ్ చేసే ప్రయత్నం చేసి వెనక్కు తగ్గారు నిర్మాత దిల్ రాజు. కుర్రాడి వ్యవహారం ఏమంత ప్రామిసింగ్ గా కనిపించకపోవడమే అందుకు కారణమని గుసగుసలు వున్నాయి.
ఆ తరువాత ఈ కుర్రాడిని ఎవరి చేతిలో పెడదాం అని తండ్రి గల్లా జయదేవ్ తెగ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఒకటి రెండు పేర్లు వినిపించాయి కానీ, ఆఖరికి ఓ డైరక్టర్ పేరు ఫైనల్ అయింది. భలే మంచి రోజు, దేవ్ దాస్ సినిమాలు అందించిన శ్రీరామ్ ఆదిత్య చేతిలో పెట్టారు ఈ కుర్రాడిని ఇప్పుడు.
ఈ సినిమాకు నిర్మాతగా గల్లా కుటుంబమే వ్యవహరిస్తుంది. గల్లా అశోక్ బాడీ లాంగ్వేజ్ కు సరిపడా మాంచి థ్రిల్లర్ స్టోరీని తయారుచేసే పనిలో బిజీగా వున్నట్లు తెలుస్తోంది. మినిమమ్ బడ్జెట్ లో కుర్రాడిని లాంచ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.