విద్యాబాలన్ నటించిన ‘డర్టీపిక్చర్’ సినిమా బాలీవుడ్లో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కానీ, ‘అలాంటి సినిమాలు నేను చేయను’ అంటూ ‘డర్టీపిక్చర్’ పేరును ప్రస్తావిస్తూ, విద్యాబాలన్పై సెటైర్లు వేసింది బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్. ఈ విషయం ఆ నోటా ఈ నోటా విద్యాబాలన్ వద్దకు చేరింది. ‘అది ఆమె ఇష్టం.. దీనిపై నేనేమీ కామెంట్ చెయ్యదలచుకోలేదు..’ అని విద్యాబాలన్ స్పందించిందట కరీనాకపూర్ వ్యాఖ్యలపై.
కాగా, బాలీవుడ్ సినీ జనం మాత్రం గతంలో కరీనాకపూర్ చేసిన ‘చమేలి’, ‘హీరోయిన్’ ఎలాంటి తరహా సినిమాలు.? అవన్నీ ‘డర్టీపిక్చర్’ని మించి డర్టీగా వుంటాయి కదా.. అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. బాలీవుడ్లో హీరోయిన్లు ఒకరిపై ఒకరు ఏదో ఒకరకంగా దుమ్మెత్తిపోసుకోవడం సహజమే. ఆ కోవలోనే కరీనా, విద్యాబాలన్పై సెటైర్లు వేసిందనుకోవాలి.
మామూలుగా అయితే కరీనా, వివాదాలకు కాస్తంత దూరంగా వుంటుంది. గతంలో చీటికీ మాటికీ నోరు పారేసుకుంటుందన్న విమర్శలు ఎదుర్కొంటున్నా, పెళ్ళయ్యాక అవన్నీ మానేసుకుంది. మరిప్పుడెందుకు ‘డర్టీపిక్చర్’ పేరుతో విద్యాబాలన్పై కరీనా సెటైర్లు వేసిందో ఎవరికీ అర్థం కావడంలేదు. అయినా ‘డర్టీపిక్చర్’ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ సినిమాలో విద్యాబాలన్ అందాల ప్రదర్శనకన్నా, సినిమాలో నటన, కాన్సెప్ట్ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఈ విషయం కరీనాకపూర్కి కూడా తెలుసు.
మరి కరీనా ఎందుకలా మాట్లాడిరది.? ఏమో ఆమెకే తెలియాలి.