సూర్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా తానా సేంద్ర కూటమ్. ఈ సినిమా రాబోయే సంక్రాంతికి తెలుగులో గ్యాంగ్ అనే పేరుతో అందించబోతున్నారు. ఈ సినిమా టీజర్ ఇప్పుడు బయటకు వచ్చింది. టీజర్ అనే కన్నా మినీ ట్రయిలర్ అనాలేమో. ఎందుకంటే నిమిషం మీద 14సెకెండ్లు వుంది. ఎంత వరకు చూపించగలరో అంతా చూపించారు.
తమిళ జనాలకు, అక్కడి సూర్య అభిమానులకు ఎలా వుంటుందో కానీ, మన జనాలకు మాత్రం పడుతుందని అనుకోవడానికి లేదు. ఇది కేవలం టీజర్ వల్ల తెలుస్తున్నది. టీజర్ లో లేనిది, ఇంకా చాలా వుంటుంది కాబట్టి, సినిమాను చూసి కానీ పక్కగా చెప్పలేం. కానీ టీజర్ అడుగు జాడల్లోనే సినిమా వుంటే మాత్రం తెలుగు ఆడియన్స్ కు పట్టడం కష్టం అన్నది పక్కా.
టీజర్ లో వున్న పాటలు, కొన్ని సీన్లు తమిళ ఆడియన్స్ పల్స్ పట్టుకుని చేసినట్లే వున్నాయి. సూర్య గెటప్ కూడా అంత గొప్పగా, గ్లామరస్ గా ఏమీ లేదు. మరి ట్రయిలర్ వస్తే ఏమైనా తేడా అనిపిస్తుందేమో చూడాలి.