పుష్ప 2 తరువాత హీరో బన్నీ లేటెస్ట్ సినిమా ఏమిటి? ఎప్పుడు? అన్నది ఇంకా డిస్కషన్లలోనే ఉంది. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మైథలాజికల్ టచ్ మూవీ డైలాగ్ వెర్షన్ జరుగుతోంది. దాంతో పాటు ఎవరు టెక్నీషియన్లు, సీజి వర్క్‌కు ఎవరు బెటర్ అన్న డిస్కషన్లు జరుగుతున్నాయి.
కానీ ఈ సినిమా తో పాటు, ఈ సినిమా కన్నా ముందుగా విడుదల చేయడానికి వీలుగా మరో సినిమా చేయాలన్నది హీరో బన్నీ ఆలోచన. అందుకోసమే సన్ పిక్చర్స్ నిర్మాతగా, అట్లీ డైరెక్షన్‌లో సినిమా అనే దాన్ని ఫైనల్ లిస్ట్‌లోకి చేర్చారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ అది అనౌన్స్మెంట్ వరకు రాలేదు.
దీనికి కారణం కమర్షియల్స్ తేలకపోవడమే అని తెలుస్తోంది. పుష్ప 2 సినిమాకు బన్నీ టోటల్ మార్కెట్ అమౌంట్‌లో 27 శాతం తీసుకున్నారని వార్తలు ఉన్నాయి. అంటే దాదాపు 250 కోట్లకు పైగా. కానీ ఈ సినిమాకు ఎంత ఉండాలో అనే క్వశ్చన్ ఉంది. అట్లీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుడు. 100 కోట్లకు కాస్త దగ్గరగా కోట్ చేస్తారు రెమ్యూనిరేషన్. బన్నీకి రెండు వందల కోట్లు ఇచ్చి, అట్లీకి 100 కోట్లు ఇస్తే రెమ్యూనిరేషన్లు అన్నీ కలిపి మూడు వందల యాభై కోట్ల మేరకు చేరిపోతాయి. ఇక ప్రొడక్షన్ ఖర్చు ఎంత, మార్కెట్ ఎంత అన్న లెక్కలు ఉంటాయి.
ఇప్పుడు ఇవే డిస్కషన్లలో వున్నాయని, అవి వన్ ఫిక్స్ అయితే అప్పుడు ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాకు ఈ సమస్య లేదు. ఎందుకంటే అక్కడ గీతా సంస్థ భాగస్వామ్యం ఉంటుంది కనుక, ఎమికబుల్‌గా మాట్లాడేసుకుంటారు. అట్లీ సినిమా, త్రివిక్రమ్ సినిమా సమాంతరంగా ఉంటాయని ఇప్పటి వరకు వున్న వార్తల సమాచారం.
Digging big hole for distributors.
Fans and movie lovers keep chillu for your pockets too
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,