కంగారు పడకండి..అల్లు అరవింద్ గారి కుటుంబ వ్యవహారం కాదిది. ఆయనకేమి ఫుల్ సౌండ్ పార్టీ. ఇంతకీ విషయం ఏమిటంటే, అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు సంబంధించి ఓ చిన్న లైన్ లీక్ అయింది.
Advertisement
ఆ సినిమాలో అల్లు అర్జున్ ఫ్యామీలీ ఫైనాన్షియల్ గా దివాలా తీసి, అద్దె ఇంట్లోకి వస్తారట. ఆ ఇల్లు జెన్నీ అనే చొటా కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుది. అక్కడ చాలా సరదా సరదా సంగతుంటాయట. అదీ విషయం.
త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఈ మాత్రం లీక్ బయటకు రావడమే గొప్ప. ఇంకా మరిన్ని సంగతులు బయటకు రావాల్సివుంది. అప్పుడు కానీ కథ కొలిక్కి రాదు.