Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనుష్కకు ఏమయింది?

అనుష్కకు ఏమయింది?

అనుష్క బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ మధ్య కాలంలో అనుష్కకు సరైన హిట్ అన్నదే లేదు. దాదాపు నటించిన సినిమాలన్నీ అయితే బకెట్ తన్నేసినవి లేదా సో సో అనిపించుకున్నవే. అలాంటి టైమ్ బాహుబలి లాంటి భీకర బ్లాక్ బస్టర్ వచ్చింది. పైగా అనుష్కకు మాంచి పాత్ర దొరికిందని, మాంచి పెర్ ఫార్మెన్స్ ఇచ్చిందని ప్రశంసలు కూడా దక్కాయి.

అయినా కూడా అనుష్కను ఏదో వెలితి ఇబ్బంది పెడుతున్నట్లుందని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నట్లుంది తన పర్సనల్ స్టాఫ్ ను పనుల్లోంచి తొలగించిందని వార్తలు వినిపిస్తున్నాయి. డేట్ లు, సినిమాలు చూసే కీలక పర్సన్ తో సహా చాలామంది స్టాఫ్ కు అనుష్క ఉద్వాసన చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సాధారణంగా మేనేజర్ లనో, స్టాఫ్ నో మార్చడం అంటే పని తీరు బాగా లేకనే అయి వుంటుంది. కానీ ఎక్కువ మందిని ఒకేసారి ఉద్యాసన చెప్పడం అంటే కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ మధ్య దర్శకుడు పూరి జగన్నాధ్ ఇలాగే టోటల్ స్టాఫ్ ను ఒక్కసారిగా తీసేసి, కొత్త బ్లడ్ ను నింపారు. ఇప్పుడు అనుష్క వంతు వచ్చినట్లుంది. అనుష్క బాహుబలి సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతోందని, ఎందుకో ఆమె కాస్త ఫీలవుతున్నట్లు వున్నదని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అనుష్క చేతిలో ప్రభాస్ స్వంత బ్యానర్ నిర్మిస్తున్న భాగమతి సినిమా వుంది. గడచిన కొద్ది కాలంగా అనుష్క పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి కానీ, ఏవీ కన్ ఫర్మ్ కాలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?