కాలం కలిసి వస్తే నడిచి వచ్చే బిడ్డ పుడతాడని సామెత. బాబు బంగారం వ్యవహారం అలాగే కనిపిస్తోంది. ఈనెల 29 న వద్దాం అనుకున్నారు. కానీ ముందు వారం రజనీ కాంత్ కబాలి వస్తోంది. ఏం చేయాలా అని కిందా మీదా అవుతూ, ఆఖరికి ఆగస్టు మూడో వారానికి వెళ్లాలని అనుకున్నారు. ఎందుకంటే ఆగస్టు 12న జనతా గ్యారేజ్ వుంటుంది కాబట్టి అటో వారం, ఇటో వారం వదిలేద్దామని.
ఇప్పుడు జనతా గ్యారేజ్ ఏకంగా సెప్టెంబర్ కు వెళ్లిపోయింది. మాంచి లాంగ్ వీకెండ్ డేట్ ఖాళీగా వుంది. అందుకే ఆ డేట్ ను వాడుకోవాలని బాబు బంగారం డిసైడ్ అయిపోయాడు. 12న విడుదలయితే ఫుల్ హాలీడే మూడ్ వుంటుంది నాలగు రోజుల పాటు. పైగా వెనుక కూడా వచ్చే సినిమాలు ఏవీ లేవు. ముందు కూడా కబాలి తరువాత మూడు వారాల పాటు పెద్ద సినిమాలు ఏవీ వుండవు.
జనతా గ్యారేజ్ వదిలేసుకున్న అద్భుతమైన అవకాశాన్ని బంగారం అందిపుచ్చేసుకున్నాడన్నమాట. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకీ సరసన నయన తార నటిస్తోంది.