బాయ్ కాట్.. ఓ రూలంటూ లేదా?

కాజల్ ప్రెస్ మీట్ ను మీడియా బాయ్ కాట్ చేసింది. మంచిదే. ఓ టైమ్ చెప్పి, గంటలు గంటలు ఆలస్యంగా వచ్చే సెలబ్రిటీలకు ఇలాంటి పాఠం అవసరమే. కానీ ఒకటే సమస్య. మన సినిమా…

కాజల్ ప్రెస్ మీట్ ను మీడియా బాయ్ కాట్ చేసింది. మంచిదే. ఓ టైమ్ చెప్పి, గంటలు గంటలు ఆలస్యంగా వచ్చే సెలబ్రిటీలకు ఇలాంటి పాఠం అవసరమే. కానీ ఒకటే సమస్య. మన సినిమా మీడియా ఓ పద్దతి లేకుండా వ్యవవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు గంటలు గంటలు వెయిట్ చేస్తారు. కొన్నిసార్లు అరగంటకే బాయ్ కాట్ అంటారు.

ఆ మధ్య రోబో ఫంక్షన్ జరిగింది. గంటలు లేటుగా వచ్చారు రజనీ, అక్షయ్ కుమార్. మరి మీడియా ఏం చేసింది? పార్క్ హయాత్ లో పడిగాపులు పడింది. మొన్నటికి మొన్న రోబో ప్రెస్ మీట్ జరిగింది. దిల్ రాజు గంటన్నర ఆలస్యంగా వచ్చారు. మీడియా ఏం చేసింది? కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చుంది.

అంత ఎందుకు కాజల్ ను బాయ్ కాట్ చేయడానికి ముందురోజే తమన్నా గంటలు గంటలు లేటుగా వచ్చింది. కానీ బాయ్ కాట్ చేయలేదు. అప్పుడెప్పుడో అల్లుఅర్జున్ ను బాయ్ కాట్ అన్నారు. ఆ తరువాత ఎన్ని ప్రెస్ మీట్లకు సెలబ్రిటీలు ఆలస్యంగా రాలేదు. ఎన్ని ఫంక్షన్లు ఆలస్యంగా మొదలుకాలేదు. ఇవన్నీ బాయ్ కాట్ చేయకపోవడం విశేషం.

అందుచేత మీడియా ఈ విషయంలో ఓ పద్దతి పాటించాలన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అరగంట చూస్తాం.. లేదా గంట చూస్తాం.. ఏ హీరో అయినా ఒకటే, ఏ హీరోయిన్ అయినా ఒకటే అని వుండాలి తప్ప, ఇలా ఆవేశంలో ఒకలా, లేదంటే మరోలా చేయడం కరెక్ట్ కాదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

మంత్రిగారికి ఓటమి తప్పదు.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్