Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బ్రహ్మీకి మళ్లీ నిరాశేనా?

బ్రహ్మీకి మళ్లీ నిరాశేనా?

చిరకాలంగా సరైన హిట్ లేక, దాదాపు సైడ్ అయిపోయారు స్టార్ కమెడియన్ బ్రహ్మీ. మొన్నటికి మొన్న అల్లరి నరేష్ ఇంట్లో దెయ్యం-నాకేం భయ్యంలో కూడా పేలవమైన పాత్రలో కనిపించాడు. అభిమానులకు ఏమాత్రం సంతృప్తి అందించలేకపోయారు.

దాదాపు పెద్ద ప్రాజెక్టులు ఏవీ బ్రహ్మీకి దగ్గరగా రావడం లేదు. ఇలాంటి టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాలో మాంచి కామెడీ ట్రాక్ బ్రహ్మీ పై రన్ చేసారు. నిజానికి కత్తి ఒరిజినల్ లో ఈ కామెడీ ట్రాక్ లేదు. కేవలం తెలుగు ఆడియన్స్ కోసం క్రియేట్ చేసారు.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఇన్ సైడ్ టాక్ ఏమిటంటే, ఖైదీ నెంబర్ 150 సినిమా అంతా బాగా వచ్చింది కానీ, ఈ కామెడీ ట్రాక్ మాత్రం క్లిక్ కాలేదని. ఈ కామెడీ ట్రాక్ బాగా ఏవరేజ్ గా వచ్చిందని.

అంటే పాపం, బ్రహ్మీ మళ్లీ మరోసారి తాను డిస్సపాయింట్ అయి, ఫ్రేక్షకులను కూడా డిస్సపాయింట్ చేయబోతున్నాడన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?