అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందుతోన్న చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్‌కి అంతరాయం ఏర్పడడంతో ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనే ఐడియా డ్రాప్ అయ్యారు. నిజానికి ఓ పెద్ద సినిమాని సెలవులు లేని సీజన్లో రిలీజ్ చేయడం రిస్కే.
కానీ షూటింగ్ పూర్తయిన చిత్రాన్ని రెండు నెలల పాటు విడుదల చేయకుండా ఉంచడం కంటే ఫిబ్రవరిలో విడుదల చేసేయడం మంచిదని అనుకున్నారు. షూటింగ్ డిలే కావడంతో ఇప్పుడు సమ్మర్ రిలీజ్‌కి అన్నీ అనుకూలంగా మారాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌లో, యూత్‌లో ఫాలోయింగ్ బాగా ఉన్న అల్లు అర్జున్ సినిమాకి సమ్మర్ రిలీజ్ ఐడియల్.
కార్మికుల సమ్మె కారణంగా కొన్ని సినిమాలు సీజన్ అడ్వాంటేజ్‌ని కోల్పోతే, బన్నీకి మాత్రం అది కూడా కలిసొచ్చేసి ఇప్పుడు సమ్మర్ రిలీజ్ కుదిరేసింది. గత ఏడాది సమ్మర్ హాలిడేస్‌ని ఫుల్లుగా వాడేసుకుని ‘రేసుగుర్రం’తో ఆ ఇయర్‌కి బిగ్గెస్ట్ హిట్ కొట్టేసిన అల్లు అర్జున్ ఈసారి కూడా అదే ఫీట్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు.