రివెంజ్ ఫార్ములా అన్నది ఇండియన్ సినిమాకు నెంబర్ వన్ సక్సెస్ ఫార్ములా. తెలుగు సినిమాలకు సెవెన్టీస్ లో కీలకమైన ముడిసరుకు. ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతోంది. ఈ నెల 19న విడుదలవుతున్న కేశవ రివెంజ్ స్టోరీనే. తల్లితండ్రులను కిరాతకంగా చంపిన వాళ్లను హీరో ఎలా ప్లాన్ చేసి చంపేసాడు అన్నది లైన్. అయితే హీరోకి చిన్న ప్రాబ్లమ్ అన్నది కాస్త కొత్త కాన్సెప్ట్.
ఇదిలా వుంటే సాయి కొర్రపాటి నిర్మాతగా కొత్త దర్శకుడితో నాగ్ చైతన్య చేస్తున్న సినిమా కూడా సేమ్ టు సేమ్ ఇదే రివెంజ్ ఫార్ములా అంట. తల్లి తండ్రులు (రేవతి-రావు రమేష్) ను చంపిన వారిపై ఎలా పగతీర్చుకున్నాడన్నది. అంటే చైతన్య మరోసారి తనకు అచ్చిరాని మాస్, యాక్షన్ జోనర్ లోకి అడుగు పెడుతున్నాడన్నమాట. మళ్లీ మరోసారి ఆ జోనర్ లో లక్ ను ట్రయ్ చేయబోతున్నాడన్నమాట.