నాగ సూర్య హీరోగా కొర్రపాటి సాయి నిర్మిస్తున్న సినిమా దిక్కులు చూడకు రామయ్యా…రాజమౌళి అసిస్టెంట్ త్రికోటి దర్శకుడు. చిన్న సినిమాలు ప్లాన్ చేసి, తీయాలని సాయి మొదలుపెట్టిన రెండో సినిమా ఇది. కానీ ఇప్పుడు ఇది పెద్ద సినిమా అయిందట. సబ్జెక్ట్ బాగుందని, కథ డిమాండ్ చేసిందని ఇప్పటికే ఆరేడు కోట్లు దాటించేసారట ఖర్చు. ఓ సాంగ్ సెట్ అయినా భారీగా వుండాలని అనుకోవడంతో కోటి ఖర్చు చేసేసారట.
మొత్తం మీద సినిమా పూర్తయ్యేసరికి పది అవుతుందని వినికిడి. మరి ఎంత కథ, కథనాలు బాగున్నా నాగసూర్య లాంటి అప్ కమింగ్ హీరోకి అంత బడ్జెట్ అంటే కాస్త ఆలోచించాలి. హిట్ అయితే పైసలు రావడం సరే, ముందు కొనడానికి జనం జంకుతారు కదా? ఓ పంపిణీ దారుగా సాయి కి ఈ విషయం తెలియదని అనుకోలేం. తెలిసి ఖర్చు చేస్తున్నారంటే, మరేదో విషయం వుండి వుండాలి.