మెగాస్టార్ కు బోయపాటే రైట్?

మెగాస్టార్ కు సరైన సినిమా ఎవరు ఇవ్వగలరు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై మెగాభిమానులు ఏమనుకుంటున్నారో అని చిన్న ఎంక్వయిరీ జరిగిందట..చిరంజీవి సన్నిహితులే దీన్ని చేసారని వినికిడి. ఈ సమాచార సేకరణలో రెండు…

మెగాస్టార్ కు సరైన సినిమా ఎవరు ఇవ్వగలరు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై మెగాభిమానులు ఏమనుకుంటున్నారో అని చిన్న ఎంక్వయిరీ జరిగిందట..చిరంజీవి సన్నిహితులే దీన్ని చేసారని వినికిడి. ఈ సమాచార సేకరణలో రెండు పేర్లు ఫైనల్ గా తేలాయట. ఒకటి వివి వినాయక్, రెండవది బోయపాటి శీను. వి వి వినాయక్ ఎలాగైనా జనాలకు సినిమాను చేర్చేయగలడు అని ఓ అభిప్రాయం. 

బాలయ్యకు రెండు సార్లు లైఫ్ ఇచ్చిన సినిమాలు అందించాడు..ఓ రేంజ్ సినిమాలు చేయగల సత్తా వున్నవాడు బోయపాటి అని రెండో అభిప్రాయం. అయితే మెగాస్టార్ సన్నిహితులు మాత్రం వేరే కారణాల రీత్యా వినాయక వైపే  మొగ్గుతున్నారట. అయితే చిరంజీవి మాత్రం సరైన ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన కథ ఎవరు తెస్తే వారికే అవకాశం ఇద్దామంటున్నారట. ఎంటర్ టైన్ మెంట్ లైన్ కోసం చూస్తున్నారు కాబట్టి వినాయక్ నే సరి అని మళ్లీ సన్నిహితులు అంటున్నారట. కానీ చిరును అభిమానులు మాత్రం బాలయ్య లెజెండ్ లా ఓ రేంజ్ లో చూద్దామనే అనుకుంటున్నారట. అందుకు బోయపాటే బెటర్ అని అంటున్నారట.