దర్శకుడితో మూడుముళ్లు… రెడీ అవుతున్న నాయిక

సినిమావాళ్లు సినిమావాళ్లనే పెళ్లిచేసుకోవడం ఈరోజు కొత్తేమీ కాకపోయినా… ఈ రకం వార్తలు మాత్రం ప్రతీసారీ కొత్తగానే ఉంటాయి. నాయక్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి రచ్చ చేసిన బ్యుటీ అమలాపాల్! సినిమాలో కాకుండా…

సినిమావాళ్లు సినిమావాళ్లనే పెళ్లిచేసుకోవడం ఈరోజు కొత్తేమీ కాకపోయినా… ఈ రకం వార్తలు మాత్రం ప్రతీసారీ కొత్తగానే ఉంటాయి. నాయక్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి రచ్చ చేసిన బ్యుటీ అమలాపాల్! సినిమాలో కాకుండా నిజజీవితంలోనూ ప్రేమలో పడింది.! సినిమావాళ్ల ప్రేమల్లో సక్సెస్ రేటు మనకు అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా? ఇది నిజంగా నిజమైన ప్రేమేనటండి! ఎంతనిజం అంటే… త్వరలో పెళ్లికూడా చేసుకోబోతోందంట ఈ సుందరాంగి!

మదరాసుపట్టణం, తలైవార్ సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న తమిళ దర్శకుడు విజయ్ తో ప్రేమలో పడింది అమలాపాల్.! తను నటించిన సినిమాలో హీరో తో ప్రేమలో పడిన అమలాపాల్… నిజజీవితంలో మాత్రం ఆ సినిమా దర్శకుడితో ప్రేమాయాణం సాగించింది! ఈ ప్రేమాయణానికి సంబందించిన వార్తలు గాసిప్స్ అనుకుంటున్న తరుణంలో… దర్శకుడు విజయ్ విదేశాల్లో షూటింగుల్లో బిజీగా ఉన్నాడు, తిరిగి చెన్నై రాగానే తమ పెళ్లిపై ఒక క్లారిటీ ఇస్తామని ప్రెస్ నోట్ ని విడుదల చేసింది!

కానీ… జూన్ రెండోవారంలో వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారన్న పుకార్లు మాత్రం మదరాసుపట్టణంలో షికార్లు చేస్తున్నాయి! ఈ సందర్భంగా మనం కూడా అమలాపాల్ కి కంగ్రాట్స్ చెబుదాం!