డిక్టేటర్ యుఎస్ సేల్ మొత్తానికి పూర్తయింది. సినిమా సెన్సారు పూర్తయినా అమ్మకం పూర్తి కాలేదు. ఆఖరికి గురువారం రాత్రికి ఫైనల్ అయింది. బాలకృష్ణకు ఓవర్ సీస్ మార్కెట్ అంతంత మాత్రమే. అయినా ఈసారి ఈ సినిమా విడుదల అన్నది ప్రెస్టీజ్ క్వశ్చను. అవతల ఎన్టీఆర్ సినిమా అన్ని సెంటర్లలో ఓవర్ సీస్ లో విడుదలవుతుంటే, బాలయ్య బాబు సినిమా విడుదల కాకుంటే అంత బాగోదు.
సినిమా హక్కుల సంగతి అలా వుంచితే ఈ విషయమై యుఎస్ లో చాలా మల్లగుల్లాలు పడ్డట్టు వినికిడి. ఇక్కడ తెలుగుదేశం అధికారంలో వుంది. అలాంటపుడు ఓవర్ సీస్ లో బాలయ్య సినిమా విడుదల కాకుంటే, రేపు అక్కడ తెలుగుదేశం అభిమానులమనో, బాలయ్య ఫ్యాన్స్ అనో చెప్పుకునేవారు ఇక్కడికి వస్తే నామర్దాగా వుంటుంది. అందుకే ఆఖరికి ఓ చిన్న బయ్యర్, కొంతమంది ఫ్యాన్స్ కలిసి డిక్టేటర్ ను ఓవర్ సీస్ లో పంపిణీకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముఫై అయిదు లేదా నలభై లక్షల మేరకు హక్కులు తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ యూనిట్ వర్గాలు మాత్రం అతి కరెక్ట్ కాదని, ఎనబై మేరకు ఇచ్చారని అంటున్నారు. అయితే అంత లేదని, నలభై లోపే అని ఓవర్ సీస్ నుంచి వినిపిస్తున్న వార్తల సారాంశం. ఇక్కడ మార్కెట్ లెక్కలు దాగుతాయి కానీ ఓవర్ సీస్ లెక్కలు దాగవు. అదే సమస్య. మరి థియేటర్లు ఎన్ని వేస్తారో, కలెక్షన్లు ఎలా వుంటాయో చూడాలి.