హన్సికా మొత్వానీ కూడా ఎమ్మెమ్మెస్ బాధితురాలైంది. ఇది వరకూ త్రిష, ప్రీతీ జింతా వంటి వాళ్ల నగ్న వీడియోలు అంటూ ఇంటర్నెట్ లో హల్ చల్ చేసిన రీతిలోనే ఇప్పుడు హన్సిక వీడియోలో ఒకటి ఆమెకు తలనొప్పిని తెచ్చిపెడుతోంది. గత కొన్ని రోజులుగా ఈ వీడియో ఇంటర్నెట్ లో కనిపిస్తోంది.
ఎవరు అప్ లోడ్ చేశారో కానీ.. హన్సిక బాతింగ్ వీడియో అంటూ దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. వీడియోలో ఫేస్ క్లియర్ గా కనపడదు.. ఆ అమ్మాయి హన్సికను పోలి ఉంటుంది. దీంతో హన్సికకు ఇబ్బంది కలుగుతోంది. ఇప్పటికే హన్సిక ఈ విషయం గురించి వివరణ కూడా ఇచ్చినట్టుగా ఉంది. అది తన వీడియో కాదని ఆమె స్పష్టం చేసింది. అసలు అలాంటి ఊహాగానాలు కూడా వద్దని కొట్టి పడేసింది.
అయితే ఈ ఎమ్మెమ్మెస్ మాత్రం ఈ హీరోయిన్ కు ఇరిటేషన్ కలిగించేదే. కానీ హన్సిక మాత్రం దీన్ని పూర్తిగా లైట్ తీసుకొంది. త్రిష, ప్రీతిజింతా లాంటి వాళ్లు తమ పేరుతో ప్రచారంలోకి వచ్చిన నగ్న వీడియోల గురించి పట్టించుకోనట్టుగా వ్యవహరించినట్టుగానే హన్సిక కూడా ఈ వీడియోను పట్టించుకోవడం లేదు. అయితే ఈ ఎమ్మెమ్మెస్ మాత్రం ఇంటర్నెట్ ల వైరల్ గా వ్యాపిస్తోంది. అయినా హీరోయిన్లకు ఏమిటో ఈ బాధలన్నీ!