త్రివిక్రమ్‌ని పట్టే దారేది?

దర్శకులుగా మారిన రచయితల్లో త్రివిక్రమ్‌కి వచ్చినంత క్రేజ్‌ ఎవరికీ రాలేదేమో..? ‘ఖలేజా’ లాంటి ఫ్లాప్‌ ఇచ్చినా అతని డిమాండ్‌ ఏమాత్రం తగ్గలేదు. ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలో మళ్లీ విజృంభించాడు. అందుకే త్రివిక్రమ్‌తో సినిమా…

దర్శకులుగా మారిన రచయితల్లో త్రివిక్రమ్‌కి వచ్చినంత క్రేజ్‌ ఎవరికీ రాలేదేమో..? ‘ఖలేజా’ లాంటి ఫ్లాప్‌ ఇచ్చినా అతని డిమాండ్‌ ఏమాత్రం తగ్గలేదు. ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలో మళ్లీ విజృంభించాడు. అందుకే త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని హీరోలంతా క్యూ కడుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఇప్పటికే త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని తెగ ఉబలాటపడుతున్నారు. మరోవైపు మహేష్‌ కూడా కర్చీఫ్‌ వేసేశాడట. వెంకటేష్‌తో ఎప్పుడో సినిమా చేయాల్సింది. కానీ వీలు పడలేదు. అందుకే వెంకీ నుంచి కూడా గట్టిగా ప్రయత్నాలు మొదలయ్యాయి.

కానీ త్రివిక్రమ్‌ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. తన తరువాతి సినిమా ఎవరితో చేయాలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. దాంతో త్రివిక్రమ్‌ని ఎలా తమ దారిలోకి తెచ్చుకోవాలా..? అని ఆలోచిస్తున్నారు హీరోలు. అయితే త్రివిక్రమ్‌ ఇప్పుడు పూర్తిగా పవన్‌ కల్యాణ్‌ కనుసన్నల్లో మెదులుతున్నాడని టాక్‌. నిత్యం పవన్‌తోనే టచ్‌లో ఉంటున్నాడట. 

ఒకవేళ పవన్‌ అడిగితే వెంటనే మరో సినిమా చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. అందుకే పవన్‌ అనుగ్రహం ఉన్న కథానాయకుడితోనే ఇప్పుడు త్రివిక్రమ్‌ జట్టు కట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో… త్రివిక్రమ్‌ని పట్టాలంటే ` ముందు పవన్‌ని ప్రసన్నం చేసుకోవాలన్నమాట.