మహేష్‌ సరసన మిల్కీ బ్యూటీ

టాలీవుడ్‌కి హీరోయిన్ల కరువొచ్చింది. గట్టిగా చెప్పాలంటే పేరున్న హీరోయిన్లు అరడజను మంది కూడా లేరు ఇప్పటి జనరేషన్‌ హీరోల సరసన నటించేందుకు. వున్నోళ్ళేమో బోర్‌ కొట్టేశారాయె. దాంతో, హీరోలు సర్దుకుపోవాల్సి వస్తోంది. Advertisement మహేష్‌,…

టాలీవుడ్‌కి హీరోయిన్ల కరువొచ్చింది. గట్టిగా చెప్పాలంటే పేరున్న హీరోయిన్లు అరడజను మంది కూడా లేరు ఇప్పటి జనరేషన్‌ హీరోల సరసన నటించేందుకు. వున్నోళ్ళేమో బోర్‌ కొట్టేశారాయె. దాంతో, హీరోలు సర్దుకుపోవాల్సి వస్తోంది.

మహేష్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రానున్న ‘ఆగడు’ సినిమా కోసం చాలామంది పేర్లను పరిశీలించినా, చివరకు ఆ అవకాశం తమన్నాని వరించింది. బాలీవుడ్‌ బ్యూటీస్‌ కోసం కూడా చిత్ర యూనిట్‌ ప్రయత్నించింది. కానీ, వాళ్ళను కాదని, తమన్నాకే ఛాన్సిచ్చారు చిత్ర దర్శక నిర్మాతలు.

నవంబర్‌లో సెట్స్‌ మీదకు వెళ్ళనున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.